స్వచ్ఛ సర్వేక్షణ్ లో జీహెచ్ఎంసీకి జాతీయ అవార్డు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) స్వచ్ఛ సర్వేక్షణ్ లో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్- 2023లో జాతీయ అవార్డుకు జీహెచ్ఎంసీని ఎంపిక చేసింది. 
2023 సంవత్సరంలో గార్బేజ్ ఫ్రీ సిటీలో త్రీ స్టార్ రేటింగ్ జాబితాలో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఉండగా, తాజాగా 5 స్టార్ రేటింగ్ తో జీహెచ్ఎంసీ ఈ జాతీయ అవార్డు సాధించింది. ఈ నెల 15న దిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అందించే జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీకి ఆహ్వానం అందింది. 
 
కాగా జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ అవార్డు సాధించడం కోసం కృషి చేసిన సిబ్బందికి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ కమిషనర్ రోనాల్డ్ రాస్ ధన్యవాదాలు తెలియచేశారు.

జీహెచ్ఎంసీ సాధించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

  • 2016లో 73 నగరాలకు గాను మెరుగైన 19వ నగరంగా గ్రేటర్ హైదరాబాద్ కు అవార్డు దక్కింది.
  • 2017 లో ఓడీఎఫ్ సిటీ కేటగిరీలో 434 నగరాలు పోటీపడగా హైదరాబాద్ కు 22వ ర్యాంక్ దక్కింది.
  • 2018లో సాలిడ్ వెస్ట్ మ్యానేజ్ మెంట్ విధానంలో బెస్ట్ క్యాపిటల్ సిటీ అవార్డు కేటగిరీలో 4041 నగరాల్లో హైదరాబాద్ కు 27వ ర్యాంక్ వచ్చింది.
  • 2019 లో స్వచ్ఛ ఎక్స్ లెన్స్ అవార్డు కేటగిరీలో 4273 నగరాలు ఎంపిక కాగా అందులో హైదరాబాద్ 35వ స్థానం కైవసం చేసుకుంది.
  • 2019 లో ఓడీఫ్++ సిటీగా హైదరాబాద్ కు గుర్తింపు పొందింది.
  • 2020లో బెస్ట్ మెగా సిటీ అవార్డు సిటిజెన్ ఫీడ్ బ్యాక్ లో 4384 నగరాలు పాల్గొంటే హైదరబాద్ కు 23వ ర్యాంక్ వచ్చింది.
  • 2021 లో బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ మెగా సిటీ అవార్డు హైదరాబాద్ కు దక్కింది. అదే సంవత్సరంలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందింది.
  • 2022 లో గార్బేజ్ ఫ్రీ సిటీ కింద త్రీ స్టార్ హోదాను హైదరాబాద్ దక్కించుకుంది.