బస్తీ దవాఖానాల్లో 60 శాతం నిధులు కేంద్రానివే 

హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామన్న కేసీఆర్, కేటీఆర్ గత ఆరేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయలేదు. శిధిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో అత్యాధునిక భవనాలు నిర్మిస్తామన్న మాటలు గాలిలో కలిసిపోయాయి. 
 
1500 పడకల ఆసుపత్రి అంటూ ఘనంగా చెప్పుకున్న తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టిమ్స్) పేరు తప్ప ఇప్పటికీ అక్కడ కరోనాకు తప్ప మరే చికిత్స అందించడం లేదు. నగరానికి నాలుగు దిక్కులా 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కడతామన్న కేసీఆర్ హామీ గాలిలో కలిసిపోయింది. 
 
అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు హడావుడిగా మూడు నెలల నుండి ఏర్పాటు చేస్తున్న బస్తి దవాఖానాలు అన్ని సింహభాగం కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులతోనే కావడం గమనార్హం. 
 
టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తమ ఘనతగా చెప్పుకొంటున్న ఆ ఆస్పత్రులకు 60 శాతం నిధులు కేంద్రమే ఇస్తోంది. మెడిసిన్‌‌‌‌‌‌‌‌, డాక్టర్లు, సిబ్బంది జీతాల వరకు అన్నింటికీ నేషనల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం) కింద డబ్బులు కేటాయిస్తోంది. బస్తీ దవాఖానాలకు వందలో రూ.60 కేంద్రం, రూ.40 రాష్ట్రం పెట్టుకుంటున్నాయి.
కేంద్రం నిధులిస్తున్నా ఏర్పాటులో ఇన్నాళ్లూ శ్రద్ద చూపని కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవాలు చేసింది. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 150 డివిజన్లలో 300 బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటివరకు 224 దవాఖాన్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో మూడున్నర నెలల్లోనే 56 దవాఖాన్లను ప్రారంభించారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా చిన్న చిన్న రూములకు దవాఖానా బోర్డు తగిలించి ఓపెనింగ్ చేశారు. చాలా చోట్ల కనీస వసతులు లేకపోగా డాక్టర్లు, సిబ్బందినీ నియమించలేదు. ఇతర చోట్ల నుంచి డాక్టర్లను పంపించి ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత వీటిని పట్టించుకుంటారన్న నమ్మకం లేదు.