ఆగష్టు 15 లోపు రైతులకు రూ. 2 లక్ష ల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే బిఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుండగానే బిజెఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ఇందులో ప్రవేశించారు.
తాజాగా మహేశ్వర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం రాజకీయాలను వెడెక్కిస్తోంది. కేవలం రూ.2 లక్షల రుణమాఫీపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు, మరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేరవేరిస్తే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసేందుకు తాను కూడా సిద్ధమని ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్ట్ 15 లోపు అన్ని హామీలు నేరవేరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

More Stories
లడాఖ్‌కు బైక్ యాత్ర యువతికి దత్తాత్రేయ అభినందనలు
ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్
పరస్పరం అవినీతి కప్పిపుచ్చుకుంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్