రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరవు ముంచుకొచ్చి, తాగునీరు-సాగునీరు లేక రైతులు అల్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే, బాధ్యతారాహిత్యంగా అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పారిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఎల్ నినో ఎఫెక్ట్‌తో కరవు పరిస్థితులు నెలకొన్నాయని తాము స్వయంగా జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, పల్లెలు పర్యటించి కరవు తీవ్రతను చూశామని తెలిపారు.
ఆదిలాబాద్‌లో కరవు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని తానే స్వయంగా పరామర్శించానని చెప్పారు. అక్టోబర్ 9న కరవు పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా ‘మోస్ట్ ఇమ్మీడియట్’ నోట్ పంపించినప్పటికీ, అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి 60 మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీకి పోవడం ఎంత నిర్లక్ష్యమని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో నీళ్లు లేక, పల్లెల్లో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే రాహుల్ గాంధీ చేసే పిచ్చి తుగ్లక్ పనుల కోసం ప్రజాధనంతో ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు ఉంటే కోర్టుల్లో పిటిషన్లు వేయాలి తప్ప, సుప్రీంకోర్టు సీజేఐపై ఒత్తిడి తెచ్చేలా రోడ్లెక్కి మార్చ్ చేస్తామనడం న్యాయవ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమేనని ధ్వజమెత్తారు.
రైతులకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, రబీ పంటకు నీళ్లు, కరెంట్ ఎలా ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమం నిర్మిస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించి, ఎన్నికల డిక్లరేషన్‌లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రైతులు, బీసీలు, దళితులకు అమలు చేసేంతవరకు రాహుల్ గాంధీని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని, తెలంగాణ ప్రజలే ఆయనను అడ్డుకుంటారని తేల్చిచెప్పారు.
గోవాలో నిలబడి ప్రసంగాలు దంచే రేవంత్ రెడ్డి ముందు తెలంగాణలో డ్రగ్స్ ఏ విధంగా ఏరులై పారుతున్నాయో చూడాలని హితవు పలికారు. గంజాయి, చరస్, కొకైన్, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతూ తెలంగాణ డ్రగ్స్ మార్కెటింగ్ సెంటర్‌గా మారిందని, నిన్నగాక మొన్ననే కోట్లాది రూపాయల విలువైన 2 కేజీల ఎండీఎంఏ పట్టుబడిందని గుర్తుచేశారు.
ఓట్లు మిస్ అయ్యాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని రాoచందర్ రావు ప్రకటించారు. స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గరకు మీ వెంట మీ మజ్లిస్ దోస్తులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలను తీసుకొచ్చినా పర్లేదు..కనీసం ఓట్లు పోయిన 10 మందిని సీఈవో ఆఫీసుకు తీసుకురండి అని సవాల్ విసిరారు.

More Stories
మెదక్ జిల్లాలో వెలుగులోకి 1,100 ఏళ్ల నాటి గజలక్ష్మి శిల్పం
ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య హక్కులు, తెలంగాణలో బీజేపీకి నిర్బంధాలా?
మేధోపరమైన వైకల్యం కలిగిన పిల్లల పట్ల అవగాహన పెంపొందాలి