తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో దివ్యాంగుల సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన ప్రత్యేక సీట్లు వారికి అందుబాటులో ఉండేలా చూడాలని, వీల్‌చైర్ వినియోగించే దివ్యాంగులకు అనుకూలమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా దివ్యాంగులకు అందించే బస్ పాసులు, ప్రయాణ రాయితీలు, ఇతర సదుపాయాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచాలని కోరింది. దివ్యాంగులు ప్రజా రవాణా వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గౌరవప్రదంగా, సురక్షితంగా ప్రయాణించేలా టిజిఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
బస్సు సిబ్బందికి దివ్యాంగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా అవగాహన కల్పించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే వ్యవస్థను బలోపేతం చేయాలని కోరింది. బీజేపీ దివ్యాంగుల రాష్ట్ర కో-కన్వీనర్ బెస్త యాదగిరి, గొల్లి ప్రభాకర్, ఎదుల శ్రీనివాస్, క్రోసూరి సుబ్బారావు తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.

More Stories
కరవుతో రైతులు చస్తుంటే కేబినెట్ రద్దు చేసి ఢిల్లీకి పారిపోయిన రేవంత్
మెదక్ జిల్లాలో వెలుగులోకి 1,100 ఏళ్ల నాటి గజలక్ష్మి శిల్పం
ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య హక్కులు, తెలంగాణలో బీజేపీకి నిర్బంధాలా?