జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం

జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. అమెరికలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్‌లో ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (యూఎస్ఏ ఆఫ్ బీజేపీ) ఆధ్వరంలో  నిర్వహించిన  మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటూ  రానున్న జీహెచఏంసీ  శాసనసభ, ఎన్నికల్లో బీజేపీ వవిజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
 
బీఆరఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని, ప్రస్తుతం కాంగ్రేస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.ఈ రెండు పార్టీల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కోన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధి, జాతీయ భద్రత,మౌలిక సదుపాయాల కల్పనలో విశేష పురోగతి సాధించిందని రాంచందర్‌రావు తెలిపారు. 
 
డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా  వందే భారత్ రైళ్లు , ఆయుష్మాన్ భారత్, పీఏం ఆవాస్‌యేజనా, జల్ జీవన్ మిషన్, పీఏం కిసాన్, వంటి పథకాలు దేశ అభివృద్ధికి దోహాదపడ్డాయని  పేర్కోన్నారు. ఆర్టికల్ 370రద్దు, అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం,మహిళ  రిజర్వేషన్ బిల్లు వంటి నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు.  పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రతీ ఒక్కరూ “నేషన్ ఫస్ట్” (దేశమే ప్రథమం) అనే భావనతో ము ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
 
యుఎస్ఏ ఆఫ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, యుఎస్ఏ ఆఫ్ బీజేపీ తెలంగాణ కన్వీనర్ విలాస్‌రెడ్డి జంబులా తదితరులు మాట్లాడుతూ అమెరిలో నివసిస్తున్న భారతీయులు దేశభక్తి జాతీయవాద, భావజాలంతో బిజెపికి అండగా నిలస్తున్నారని, భారతదేశాన్ని ప్రపంచలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రవాస భారతీయులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
 
ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల విశ్వాసాన్ని చూరగోన్న నాయకుడిగా  ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అమెరికాలోని పలు రాష్ట్రలనుంచి వందలాది మంది  ప్రవాస భారతీయులు బీజేపీ నాయకులు, సామాజీక కార్యకర్తలు వ్యాపారవేత్తలు పాల్గొని ప్రధాని నరేంద్రమోదీ నాయకత్యానికి తమ మద్దతు ప్రకటించారు. వికసిత్ భారత్,2047, లక్ష్య సాధనలో తాముకూడా భాగస్వాములమవుతామని వారు పేర్కోన్నారు.