
చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా అవతరించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగించనున్నట్లు భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
చంద్రుడి నుంచి భూమికి రాళ్ల నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యం అని తెలిపారు. ఈ చంద్రయాన్-4 మిషన్లో భాగంగా హెవీ లిఫ్ట్ ఎల్ వి ఎం -3 రాకెట్‌ను రెండుసార్లు అయినా ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ రాకెట్ ద్వారా 5 కంపోనెంట్స్ను స్పేస్లోకి తీసుకుని వెళ్లి మిషన్ను విజయవంతం చేసేందుకు కక్ష్యలో వాటిని అసెంబుల్ చేయొచ్చని పేర్కొన్నారు.
చంద్రయాన్-4 మిషన్తో పాటు వచ్చే ఏడాది గగన్యాన్ మిషన్ను లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మిషన్లో భారత వ్యోమగాములను భూమి అత్యల్ప కక్ష్యకు పంపించడం, వారిని తిరిగి సురక్షితంగా తీసుకురావడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఇది కాకుండా 2026లో భారతదేశం సముద్రయాన్‌ను కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు.
ఈ మిషన్ ముగ్గురు సైంటిస్టులను సబ్‌మెరైన్‌లో 6,000 మీటర్ల లోతుకు తీసుకుని వెళ్తుందని వెల్లడించారు. తద్వారా సముద్రపు అత్యల్ప ఉపరితలాన్ని అన్వేషించనున్నట్లు తెలిపారు. ఈ అచీవ్మెంట్ గగన్యాన్ స్పేస్ మిషన్తో సహా భారత్ ఇతర ప్రధాన మిషన్లతో ఏకకాలంలో జరగనున్నట్లు వెల్లడించారు. మన దేశ అద్భుతమైన శాస్త్రీయ పురోగతి ప్రయాణంలో ఇది మంచి కో-ఇన్సిడెన్స్ అని అన్నారు.
చంద్రుడిపైకి మానవులను పంపించి, నివాస అనుకూలతలను పరిశీలించి భూమి మీద మాదిరిగానే జాబిల్లిపై కూడా జీవనం సాగించడం భారత్ సుదీర్ఘ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే భారత్ మొదట చంద్రయాన్-1తో ప్రారంభించి 2,3 ప్రయోగాలను జరిపింది. అయితే వాటిలో మొదటి రెండూ విఫలమైనా కూడా భారత్ తన ఫస్ట్ చంద్రయాన్-1 మిషన్లో చంద్రుడి ఉపరితలంపై కొంత సమాచారాన్ని పొందింది. ఆ తర్వాత చంద్రయాన్-2 మిషన్ను ప్రయోగించగా అది విజయవంతం కాలేదు.
అయితే ఆ తర్వాత ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ సత్ఫలితాలు ఇచ్చింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండిగ్ అయిన తొలి దేశంగా అవతరించి అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పతాకాల్లో నిలిచింది. ఈ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధృవం , ఉపరితలం, ప్లాస్మాపై స్టడీ చేశారు. అంతేకాక ఆ ప్రాంతంలోని మూన్ గ్రౌండ్ వైబ్రేషన్లను కూడా నమోదు చేశారు.
More Stories
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలో ఒకరు మృతి