భారత వాయు రక్షణ సామర్థ్యాలకు ఊతమిస్తూ, రష్యాకు చెందిన ఎస్-400 సుదర్శన్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థకు చెందిన నాల్గవ స్కాడ్రన్ భారత్‌కు చేరుకుంది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థకు చెందిన ఫోర్త్ స్క్వాడ్రన్ ఇండియాకు చేరుకున్నది. ఈ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేశారు. దీనిని అతి త్వరలోనే వ్యూహాత్మక కార్యాచరణ ప్రాంతంలో మోహరించనున్నారని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో క్షిపణులు, లాంచర్లు, సెన్సార్లు, రేడార్లు ఉంటాయి. అయితే దశల వారీగా రష్యా నుంచి భారత్‌కు ఈ పరికరాలు వస్తున్నాయి.
దీనిలో భాగంగా తొలి కన్‌సైన్మెంట్ ఇవాళ చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మిగితా పరికరాలు దిగుమతికానున్నాయి. ఒకసారి అసెంబ్లింగ్ చేస్తే, ఇక భారతీయ వైమానిక దళం ఎస్-400 క్షిపణి వ్యవస్థను ఆపరేషన్‌లోకి తీసుకురావచ్చు.
2018లో రష్యాతో ఎస్-400 కొనుగోలు కోసం 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం మూడు క్షిపణి వ్యవస్థలను డెలివరీ చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా మిగిలిన రెండు స్క్వాడ్రన్‌ల సరఫరాలో కొంత ఆలస్యం జరిగింది. తాజాగా నాల్గవ స్క్వాడ్రన్ రాకతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలం రెట్టింపు అయింది.
ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మరో రెండు సిస్టమ్‌ల డెలివరీ ఆలస్యం అవుతోంది. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఎస్-400 సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్-400 పనితీరుకు చెందిన ఓ వీడియోను కూడా వైమానిక దళం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో దాదాపు 300 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో, ఆకాశంలో ప్రయాణిస్తున్న పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన అత్యంత కీలకమైన నిఘా విమానాన్ని నేలకూల్చి సరికొత్త రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణి ద్వారా ఇంత సుదూరంలో ఉన్న శత్రు విమానాన్ని కూల్చడం ప్రపంచ రక్షణ చరిత్రలోనే సుదీర్ఘమైన రికార్డుగా నమోదైంది.
అయిదో స్క్వాడ్రన్‌కు చెందిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ ఈ ఏడాది చివర వరకు భారత్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఎస్-400 స్కాడ్రన్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ యూని ట్లు, క్షిపణి లాంచర్లలో కలిసి 16 వాహనాలు ఉంటాయి. ఎస్-400 అనేది ప్రపంచంలోనే అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ. ఇది యుద్ధ విమానాలు, నిఘా ప్లాట్‌ఫామ్‌లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడంతో పాటు వాటిని ట్రాక్ చేయగలదు.

More Stories
ఉత్తరాఖండ్‌లో సోషల్ మీడియా ద్వారా పాక్ ఉగ్ర నెట్వర్క్!
మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు?
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం.. 21 మంది సజీవ దహనం