బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్‌

బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్‌

* మరో కీలక నేత ప్రమోద్ మృతి

భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్‌లను కనుగొంటున్నారు. గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి జిల్లాలో ఆయుధ డంప్‌ బయటపడిన విషయం తెలిసిందే. 

తాజాగా సుక్మా జిల్లాలో కూడా మరో డంప్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. జిల్లాలోని దుల్లేడ్‌, మెట్టుగూడ అటవీ ప్రాంతంలో 203 కోబ్రా బెటాలియన్‌, సీఆర్పీఎఫ్‌ 131 బెటాలియన్‌ సిబ్బంది కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో మెట్టుగూడ గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను కనుపెట్టారు. 

అందులో పరిశీలించగా 21 ఐఈడీలు, మల్టీ బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌ (బిజీఎల్), ఒక జనరేటర్‌ సెట్‌, లాత్‌ మెషిన్‌ పరికరాలు, భారీ మొత్తంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామాగ్రి ఉన్నాయి. భద్రతా బలగాలు భారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగినట్లయింది.

ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చనిపోయిన 27 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. వారిలో దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్‌ చలపతి కూడా ఉన్నారు. మరో మావోయిస్టు కీలక నేతను హతమయ్యారు. మావోయిస్టులు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రమోద్ మృతి చెందారు.

ప్రమోద్ అలియాస్‌ చంద్రహాస్‌ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని భద్రతా బలగాలు వెల్లడించాయి. ఒడిశాతో పాటు ఈస్ట్‌ జోనల్‌ బ్యూరో ఇంఛార్జ్‌గా చంద్రహాస్‌ పనిచేశారు. చంద్రహాస్‌పై రూ.20 లక్షలకు పైగా రివార్డు కూడా ఉంది.