* సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్
ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న కేసులో విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్ను మంగళవారం విచారణ కోసం రావాలని ఈడీ గతంలోనే కోరింది. అయితే తన క్వాష్ పిటిషన్పై ఇవాళ తుది తీర్పు వస్తోందని, తనకు ఈరోజు కాకుండా మరింత సమయం కావాలని ఆయన ఈడీ ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపారు. దీనికి ఈడీ అధికారులు కూడా సమ్మతించారు.
అయితే ఈరోజు హైకోర్టులో కేటీఆర్‌కు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. అటు ఏసీబీ కూడా ఈనెల 9న విచారణను రావాలని కేటీఆర్‌కు సోమవారం మరోసారి నోటీసులు జారీచేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
ఈ కేసులో ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం అందులో కోరింది. దానితో ఒకవేళ కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసమైనా, లేకపోతే హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి