భారత్‌లోని చీనాబ్‌ బ్రిడ్జిపై కన్నేసిన పాక్

భారత్‌లోని చీనాబ్‌ బ్రిడ్జిపై కన్నేసిన పాక్

తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ వంతెన గురించి పాకిస్తాన్ కన్నేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చీనాబ్ వంతెన గురించి సమాచారాన్ని సేకరించాలని పాకిస్తాన్‌కు చైనా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ చీనాబ్ వంతెన గురించి చైనా ఎందుకు సమాచారాన్ని సేకరిస్తుంది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ, రాంబన్ ల్లాల మధ్య చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ చీనాబ్ వంతెనకు సంబంధించిన వివరాలు సేకరించాలని పాకిస్తాన్‌ను చైనా కోరింది. దీంతో రంగంలోకి దిగిన పాక్ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఈ చీనాబ్ బ్రిడ్జి గురించిన కీలకమైన విషయాలు తెలుసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చీనాబ్ వంతెన గురించిన ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్, చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సేకరించినట్లు తెలుస్తోంది.

చీనాబ్ వంతెన కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చైనాలో ఉండేది. తాజాగా చీనాబ్ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ఆ రికార్డు చీనాబ్ బ్రిడ్జికి దక్కింది. అయితే అందుకోసమే చీనాబ్ విషయాలు తెలుసుకునేందుకు చైనా ఆసక్తి చూపిస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్‌ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది.

ఇటీవలె అధికారులు ఈ చీనాబ్ వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇక ఈ చీనాబ్ బ్రిడ్జి నిర్మించడానికి 20 ఏళ్లు పట్టింది. భారత్‌లోని మిగతా ప్రాంతాలతో కాశ్మీర్‌ను అనుసంధానించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఉధంపుర్‌-శ్రీనగర్‌- బారాముల్లా రైల్వే లింక్‌ -యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు.

ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే బ్రిడ్జి పేరుతో ఉన్న వరల్డ్ రికార్డును చీనాబ్ బ్రిడ్జి బద్ధలు కొట్టింది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే ఈ చీనాబ్ బ్రిడ్జి ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు కావడం విశేషం.