మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకున్న ప్రాధాన్యతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ ఆధ్మాత్మిక, శాస్త్రీయ, మిలటరీ చరిత్రను తీసుకున్నప్పటికీ గోమాతకు కీలక పాత్ర ఉందని, పురాతన కాలం నుండి గోవును పూజిస్తున్నామని ఆ ప్రకటన పేర్కొంది.
దేశవాళీ ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవు పేడ ప్రాధాన్యతను కూడా ఆ ప్రకటనలో వివరించింది. ఆవు పాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని, ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని, గోమాత ఉత్పత్తులతో మానవులు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నట్టు వివరించారు. పశువుల పెంపకందార్ల సామాజిక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ ప్రకటన తెలిపింది.
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సంతకం చేసిన ప్రభుత్వ ఉత్తరువును ఆ మేరకు జారీచేశారు. “ప్రాచీన కాలం నుండి ఆవులు మానవ జీవితంలో ముఖ్యమైన భాగం. పురాతన కాలం నుండి, ఆవు దాని చారిత్రక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి ‘కమర్రేణు’ అనే పేరు పెట్టారు. మనం దేశవ్యాప్తంగా వివిధ జాతుల ఆవులను చూస్తుంటాము. అయినప్పటికీ, దేశవాళీ ఆవుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది” అని తెలిపారు.
“దేశీయ ఆవుల సంఖ్య క్షీణించడం ఆందోళన కలిగించే విషయం” అని పేర్కొంటూ “ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పశువుల పెంపకందారులను దేశవాళీ ఆవులను పెంచమని కోరుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దేశవాళీ ఆవును ‘రాజమాత-గౌతమి’గా ప్రకటిస్తోంది”అని వివరించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఆవును రాజ్యమాతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 నవంబర్ 26వ తేదీతో ముగియనున్నందున దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నవంబర్‌లో దీపావళి పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
More Stories
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం
నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం