భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. దీని వల్ల 60ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగుమం చేసింది. సీనియర్ సిటిజన్ ఒంటరిగా లేదా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణించే సమయంలో లోయర్ బెర్త్ పొందే అవకాశం కల్పించింది.
అలాగే ఓ వృద్ధుడు మధ్య లేదా ఎగువ బెర్త్ పొంది దిగువ బెర్త్ అందుబాటులో ఉంటే టికెట్ కలెక్టర్‌ను సంప్రదించి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇద్దరి కంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణించేటప్పుడు దిగువ బెర్త్ పొందేందుకు ఈ అవకాశం లేదు.
లోయర్ బెర్త్ పొందే విధానం
- టికెట్ బుక్ చేసే సమయంలో తప్పుకుండా మీరు సీనియర్ సిటిజన్ కోటా ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఐఆర్ సీటీసీ వెబ్‌సైట్ లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల్లో రిజర్వేషన్ చేసే సమయంలో తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కోటా కింద వృద్ధులకు లోయర్ బెర్త్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- కొత్త నిబంధనల ప్రకారం వృద్ధులు ఒంటరిగా ప్రయణించకుండా లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందితో ప్రయాణిస్తే లోయర్ బెర్త్ అవకాశం ఉండదు. అప్పుడు ఏ చేయాలంటే ఎక్కువ మందితో ప్రయాణించాల్సి వస్తే సీనియర్ సిటిజన్ టికెట్‌ను విడిగా బుక్ చేయడం మంచిది. దీని వల్ల వారు లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది.
- టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వృద్ధుల వయస్సును పూరించేటప్పుడు తప్పుగా నమోదు చేయెుద్దు. వారి నిజమైన వయస్సును మాత్రమే తెలపండి. తద్వారా లోయర్ బెర్త్ దొరికే అవకాశాలు ఉంటాయి.
- పండగల వేళ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ తెరిచిన వెంటనే బుక్ చేసుకోవడం ఉత్తమం. తద్వారా అందరి కంటే ముందే సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. లోయర్ బెర్త్ కాకపోయినా కనీసం కన్ఫర్మ్ చేసిన బెర్త్ పొందే అవకాశాలైనా ఉంటాయి. ఏసీ క్లాస్ కంటే స్లీపర్ క్లాస్‌లో ఎక్కువ బెర్త్‌లు ఉంటాయి. కాబట్టి స్లీపర్ క్లాసులో బుక్ చేసుకోవడం వల్ల సీటు పొందడం సులభం అవుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ బెర్త్‌లు ఉన్న చోటే రిజర్వేషన్ చేసుకోండి.
More Stories
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం
నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం