అలాగే బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్‌తో కలిసి మణిపూర్ పోలీసులు చురచంద్‌పూర్ జిల్లాలోని గోథోల్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. స్థానికంగా ‘పంపి’ అని పిలిచే రెండు అధునాతన మోర్టార్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన సెర్చ్, ఏరియా డామినేషన్ విన్యాసాల సందర్భంగా ఈ మేరకు భారీగా ఆయుధాలను కొనుగొని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. మణిపూర్‌లో గత ఏడాది మే నుంచి మైతీ, కుకీ జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 200 మందికిపైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మరోవంక, మణిపూర్‌లో కుకిజో గ్రూప్‌లు పిలుపు ఇచ్చిన బంద్ వల్ల చురాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి జిల్లాల్లో శనివారం సాధారణ పౌర జీవనానికి అంతరాయం వాటిల్లిందని, జిరిబమ్‌లో ఒక గ్రామంలో తిరిగి దౌర్జన్య కాండ గురించి సమాచారం అందిందని అధికారులు తెలియజేశారు.
వెలుపలి నుంచి రాష్ట్రంలోకి తీవ్రవాదులు ప్రవేశిస్తున్నట్లు భద్రత సలహాదారు కుల్దీప్ సింగ్ ప్రకటన పట్ల నిరసనసూచకంగా దేశీయ ఆదివాసీ నాయకుల వేదిక (ఐటిఎల్‌ఎఫ్), కుకి విద్యార్థుల సంఘం (కెఎస్‌ఒ) సహా కుకిజో వర్గాలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఆ రెండు జిల్లాల్లో మార్కెట్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూసివేశారని, వాహనాలు రోడ్లపై నడవలేదని అధికారులు తెలిపారు.
అవాంఛనీయ సంఘటనలు ఏవైనా జరిగినట్లుగా ఇంత వరకు సమాచారం లేదని వారు చెప్పారు. రెండు జిల్లాల్లో శుక్రవారం మొదలైన బంద్ ఆదివారం వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోకి ప్రవేశించిన ‘900 మంది తీవ్రవాదులు’ ఇంఫాల్ లోయ జిల్లాల్లో సరిహద్దు గ్రామాల్లో దౌర్జన్య సంఘటనలకు దిగవచ్చునన్న వార్తల నేపథ్యంలో భద్రత బలగాలు పలు చర్యలు తీసుకున్నాయని సింగ్ ఈ నెల 20న తెలియజేశారు.
More Stories
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం
నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం