కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై వారసత్వ పన్ను విదిస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, రెండూ ఒకే గూటి పక్షులని, పరస్పరం సహకరించుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు . అమిత్ ఫేక్ వీడియోపై కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో  మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని, బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అవినీతి కేసును కాంగ్రెస్ పార్టీ అణిచివేసిందనీ, ఇరు పార్టీలు పరస్పరం సహరించుకుంటున్నాయని విమర్శలు గుప్పించారు.

భారత్ ను కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, ఈ పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు. దేశంలో మళ్లీ పాత రోజులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై వారసత్వ పన్ను విధిస్తుందని వెల్లడించారు.

‘కాంగ్రెస్ తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ తెచ్చింది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు దొంగదారిలో డబుల్ ట్యాక్స్ కడుతున్నారు. డబుల్ ఆర్ అంటే ఎవరో మీకు అర్థమై ఉంటుంది. డబుల్ ఆర్ ట్యాక్స్ తో బ్లాక్ మనీ ఢిల్లీకి చేరుతోంది. డబుల్ ఆర్ ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతలతో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ మిత్రపక్ష నేతలున్నారు’ అని ప్రధాని మోదీ విమర్శించారు.

వంద రోజుల్లో రుణమాఫీ అని కాంగ్రెస్ మోసం చేసింది. క్వింటాల్ కు రూ.500 బోనస్ అని బోగస్ మాటలు చెప్పారని ప్రధాని గుర్తుచేశారు . బీజేపీ వల్లే మహిళలకు రక్షణ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ ని ప్రధాని స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్లుగా భారతీయుల స్వప్నం అని చెబుతూ అది మీ ఓటు వల్లే రామామందిర నిర్మాణ సాధ్యమైందని తెలిపారు. 

హైదరాబాద్ లో పండుగు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్ లో ఆంక్షలు విధించారని  మోదీ విమర్శలు చేశారు. రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంధమనీ, కాంగ్రెస్ దాన్ని కించపరుస్తుందని ప్ర‌ధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై, పార్లమెంట్‌పై త‌న‌కు ఎంతో గౌరవం ఉందని పేర్కొంటూ నూతనంగా నిర్మించిన పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని ఉంచాననీ, ప్రవిత గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా రాజ్యాంగాన్ని గౌర‌విస్తాం అని తెలిపారు. 

రాజ వంశీయులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారనీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని విస్మరించిందనీ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో మొదట సవరణలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, నెహ్రు కుటుంబానికి దక్కుతుందని ప్ర‌ధాని చెప్పారు. రాజవంశీలు ఈ దేశాన్ని పరిపాలించడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారనీ, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారని మండిప‌డ్డారు.

మోదీ జీవించినంత కాలం రాజ్యాంగాన్ని కదిలిచే శక్తి ఎవరికి లేదనీ, తాను బతికి ఉన్న కాలం దళిత, ఆదివాసులు, బీసీల హక్కుల రక్షణ కోసం పాటు పడుతానని ప్రధాని తేల్చి చెప్పారు. తాను మూడో సారి ప్రధాని అయినా తరువాత ఘనంగా రాజ్యాంగ 75 వారికోత్సవం ఘనంగా నిర్వహిస్తాననీ, ఆ మహా వేడుకలో ప్రజల అందర్ని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. అలాగే.. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఎలా తూటు పోడిచిందో బహిరంగపరుస్తామని చెప్పారు.

తెలంగాణకు నాలుగు వందేభార‌త్‌ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌తో పాటు 40 రైల్వే స్టేషన్ల‌ను కూడా ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని మోదీ తెలిపారు. పలు హైవేలను అభివ్రుద్ది పరుస్తున్నామని  చెబుతూ  తెలంగాణ అభివ్రుద్దికి బీజేపీ పెద్దపీట వేసిందనీ గుర్తు చేశారు. సిద్దిపేట, సిరిసిల్లా, కొత్తపేట రైల్వే స్టేషన్ మంజూర్ చేస్ కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ అడ్డంగులు స్రుష్టించాయని ప్రధాని ఆరోపించారు. 

ఆ పార్టీలు ఓట్ల కోసం విక్రుత చేష్టలు చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్రగతి బాటలో నడిపించే సత్తా బీజేపీకే ఉందని చెబుతూ ఈ సారి ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదనీ తెలిపారు. బీజేపీ అభ్యర్థులకు వేసే ఓటు నేరుగాగా తనకు వేసినట్టు అవుతుందన పేర్కొన్నారు.