బాలరాముడికి సూర్యతిలకం

శ్రీరామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో చైత్రమాసం నవమి రోజున అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా ప్రసరించాయి. మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలక్‌ రాముడి నుదుటిని తాకాయి. కొన్ని నిమిషాల పాటు ఈ తిలకం కనువిందు చేసింది. 

కాగా, ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఆలయం మూడో అంస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. 
 
ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది. మూడున్నర నిమిషాల పాటు కనిపించే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది.
500 సంవత్సరాల తరువాత అయోధ్యలో బాల రాముడి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీరామ నవమి రోజు బాల రాముడికి 56 రకాల భోగ్, ప్రసాదం, పంజీరీ నైవేద్యాలను సమర్పిస్తున్నారు. రామనవమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయం తెలిచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు.
భక్తులు పోటెత్తడంతో అర్ధరాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని, మొత్తం 19 గంటల పాటు దర్శన ఏర్పాట్లు కల్పిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. ఈ క్రమంలో తెల్లవారు జామున నిర్వహించిన అభిషేకం కార్యక్రమం వేద మంత్రోఛ్చరణల నడుమ వైభవంగా జరిగింది.
మరోవైపు.. రామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు. ఈ శుభ సందర్భంలో నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నేనూ, లక్షలాది మంది నా దేశ ప్రజలు అయోధ్యలో రామ్ మందిరాన్ని దర్శించుకున్నాం. ఈ జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో శక్తిని నింపుతాయి అని ప్రధాని ట్వీట్ చేశారు. 
 
మరోవైపు.. రామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు. ఈ శుభ సందర్భంలో నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయాయన్నారు. ఈ ఏడాది నేనూ, లక్షలాది మంది నా దేశ ప్రజలు అయోధ్యలో రామ్ మందిరాన్ని దర్శించుకున్నాం. ఈ జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో శక్తిని నింపుతాయి అని ప్రధాని ట్వీట్ చేశారు.