
పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించవద్దని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ పిటిషన్‌పై ఇటీవల తీర్పు రిజర్వ్ చేశారు.
జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) దాఖలు పిటిషన్‍ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం జనసేన పార్టీని రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించి గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ ఏప్రిల్ 2వ తేదీన జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తరపున జనసేన అభ్యర్థులు ప్రచారం కూడా చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనసేన పార్టీకి కేంద్రం ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించిందని ఆ పార్టీ లీగల్ సెల్ జనవరిలో ప్రకటించింది. ఈసీ జనసేనకు గ్లాస్ గుర్తుని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించారని అప్పట్లో జనసేన ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు.
ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే తాజాగా ఈసీ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానితో రాజకీయ ప్రేరేపిత చర్యగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
రానున్న ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేస్తారని ఆ పార్టీ ముఖ్య నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారని, ఈ సారి కూడా ఎలాంటి గందరగోళం ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీని ఇబ్బంది పెట్టడానికే రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
More Stories
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో
గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత