హిందువులందరూ సమానమే


” సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే. ఎవరు కూడా అంటారని వారు కాదు” అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి  వినాయక్ రావు దేశ్ పాండే స్పష్టం చేశారు. అగ్రవర్ణం, అణగారిన వర్గాలు అనే ఉచ్చ నీచ భావాలకు హిందూ సమాజంలో తావు లేదని తెలిపారు. రామాయణం రచించిన మహర్షి వాల్మీకి నుంచి మొదులుకుంటే, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ వరకు ఎందరో మహనీయులు హిందూ సమాజానికి ఆదర్శనీయలని పేర్కొన్నారు. 
 
శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్వామి శివానంద ఆశ్రమంలో సామాజిక సమరసత ఆధ్వర్యంలో సామాజిక సమరసత బాధ్యులు చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హిందువులందరూ సమానమే అనే అని లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించిందని చెప్పారు. 
 
బాబు జగ్జీవన్ రామ్ తరతరాలకు ఆదర్శమని, అలాంటి మహనీయుల చరిత్రను నేటి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వివిధ ప్రసారమాధ్యమాలు, పుస్తకాల ద్వారా వీరి చరిత్రను విస్తృతం చేయాలని సూచించారు. మదనమోహన్ మాలవ్య వంటి గొప్ప మహనీయుల మన్ననలను అందుకున్న గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అని చెప్పారు. 
 
పాఠశాలలో చదివే రోజుల్లోనే అంటరానితనానికి,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి ఉపాధ్యాయుల చేత శభాష్ అనిపించుకున్న పలు సంఘటనలు ఆయన ఉదాహరించారు. కులాలు, వర్గాల వారిగా పాఠశాలలో ఏర్పాటుచేసిన తాగునీటి కుండలను పగలగొట్టి విద్యార్థులందరికీ ఒకే కుండా ద్వారా నీటిని అందించాలని పోరాడి విజయం సాధించారని తెలిపారు. 
 
తన జీవితాంతం ధర్మరక్షణకై పోరాడారని, అదే క్రమం లో క్రైస్తవ మిషనరీల ఆగడాలను ఎదిరించారని చెప్పారు. తాను పుట్టి పెరిగిన బీహార్ ప్రాంతంలో ముస్లింలు, క్రైస్తవుల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ, మతమార్పిడికి అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించిన హిందుత్వాది బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. 
 
తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే చేస్తానని , తన జాతిలో ఏ ఒక్కరిని కూడా మతం మార్చుకోనివ్వని వ్యక్తి అని చెప్పారు. చదువులో అత్యంత ప్రతిపగల జగ్జీవన్ రామ్ గొప్ప శాస్త్రవేత్త కావాలనుకున్నప్పటికి, జాతీయ నేతగా ఎదిగి దేశం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు.. సంఘసంస్కర్త.. రాజకీయవేత్త అయినా జగ్జీవన్ రామ్ బాబుజిగా ప్రసిద్ధి చెంది నట్లు వివరించారు. 
 
భారత రాజకీయాలలో సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవులు నిర్వహించి, చివరగా భారత ఉపప్రధానిగా కూడా దేశానికి సేవలందించిన మహనీయుడు అని వినాయక రాజీ కొనియాడారు. 1971లో పాకిస్తాన్ హిందుస్థాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో రక్షణ శాఖ మంత్రిగా దేశానికి సేవలందిస్తూ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పారు పేర్కొన్నారు. 
 
ఈ దేశంలో ఒకప్పుడు కులాల ప్రస్తావనే లేదని. ఆంగ్లేయులు, మహమ్మదీయుల పరిపాలన కారణంగా మనుషుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సామాజిక సమరసత పాటించాలని, అంటారనితనాన్ని రూపుమాపాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో అంటరానితనం వల్లే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని మిషనరీలు మతమార్పిడి చేస్తున్నాయని పేర్కొన్నారు.
 
 పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి సత్యం జి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భోజనంపల్లి నరసింహా మూర్తి,  శాలివాహన పండరీనాథ్, కసిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీమతి సునీత రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.