మానవాళి వికాసమే మనిషి అభివృద్ధి

మానవాళి వికాసమే మనిషి వికాసమని చెబుతూ కేవలం ఆర్థిక వనరులను, హక్కులను పొందడాన్ని అభివృద్ధి అనరని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలకే డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు.  మధ్యభారత్ ప్రావిన్స్‌లోని బంఖేడిలో నిర్వహించిన ‘నర్మ్‌దంచల్ సుమంగళ్ సంవాద్’లో భారతీయ అభివృద్ధి భావనను వివరించారు.
 
భౌసాహెబ్ భుస్కూటే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పర్యావరణ కార్యకలాపాల నుండి ఎంపిక చేసిన 100 మంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి, గోవుల పెంపుదల, నీరు, పర్యావరణం కోసం కృషి చేస్తున్న సంస్థలు చేస్తున్న కృషిని  వారు వివరించారు.
 
గ్రామీణాభివృద్ధి, పర్యావరణ కార్యక్రమాల కార్మికులతో డాక్టర్‌ భగవత్‌ మాట్లాడుతూ మనమందరం మన సంప్రదాయాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సమాజపు సానుకూల శక్తిని తీసుకొని గ్రామీణాభివృద్, పర్యావరణానికి కృషి చేయాలని సూచించారు. మన దేశంలో వేల సంవత్సరాలుగా వ్యవసాయం సాగుతోందని, అయితే భూమి బంజరుగా మారలేదని చెప్పారు. 
 
 కానీ నేటి వ్యవస్థ అనేక దేశాల్లో వ్యవసాయాన్ని నాశనం చేసిందని చెబుతూ ఒక వ్యక్తికి సంతోషం కుటుంబంలోని సంతోషం నుండి వస్తుందని, కుటుంబపు ఆనందం గ్రామం ఆనందం నుండి వస్తుందని తెలిపారు. అదేవిధంగా జిల్లా ఆనందం నుండి గ్రామం, గ్రామం ఆనందం నుండి జిల్లా సంతోషంగా ఉంటుందని మన సంస్కృతి చెబుతుందని ఆయన వివరించారు.
 
అఖిల భారత కార్యకారిని సభ్యుడు భయ్యాజీ జోషి మాట్లాడుతూ నది, భూమి, చెట్లతో సంవాదం అవసరమని స్పష్టం చేశా రు. సంఘ్ మాత్రమే కాకుండా సమాజంలోని పెద్దలు చేస్తున్న మంచి పనిని ఈ సందర్భంగా అభినందించారు. వివిధ సామాజిక సంస్థలు ‘నర్మ్‌దంచల్ సుమంగళ్ సంవాద్’లో సామాజిక కార్యక్రమాల సమాచారాన్ని అందించాయి.
 
భావు సాహెబ్ భుస్కూటే ట్రస్ట్ విలువలు, విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధి, సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణం, గోవు సేవ, ప్రమోషన్ మొదలైన రంగాలలో చేస్తున్న కృషి, ‘మేరా గావ్ మేరా తీర్థ్’ పథకం గురించి సవివరమైన సమాచారాన్ని అందించింది. రాజ్‌గఢ్ జిల్లాలోని జిరి గ్రామం, బసోడా జిల్లాలోని ఝుకర్జోగి గ్రామం, దాతియా జిల్లాలోని భర్సులా గ్రామం వంటి ప్రావిన్స్‌లోని ఆదర్శ్ ప్రభాత్ గ్రామాల పనుల గురించి కూడా వివరించారు. 
 
 దీనితో పాటు, సామాజిక కమిటీ హర్దా, సియోని మాల్వాకు చెందిన పర్యావరణ సేంద్రీయ వ్యవసాయ కమిటీ సమర్థవంతమైన ఆవుల పెంపకం, చెట్ల పెంపకం, స్వయం ఉపాధి, సేంద్రీయ వ్యవసాయం, సాంస్కృతిక అంశాలపై తమ స్థాయిలో జరుగుతున్న కృషిని వివరించింది. అదే సమయంలో నదిని జీవనాధారంగా పరిగణిస్తూ శాస్త్రీయంగా చేస్తున్న పనులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు చేసిన కృషిపై ‘నర్మదా సమగ్ర’ సంస్థ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది.