రక్షణ ఉత్పత్తిలో భారీగా పెరిగిన ప్రైవేట్ పెట్టుబడులు

రక్షణ ఉత్పత్తిలో భారీగా పెరిగిన ప్రైవేట్ పెట్టుబడులు
2023-24లో రక్షణ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగ సంస్థల వాటా భారీగా పెరిగింది. గత 8 ఏళ్లతో పోల్చుకుంటే ఈ వాటా ఎక్కువగా ఉందని విశ్లేషకులు తెలిపారు. రక్షణ ఎగుమతులు కూడా రికార్డు స్థాయికి చేరుకుందని రక్షణ ఉత్పత్తి శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి.  2023-24 మార్చి 5 తాజా లెక్కల ప్రకారం మొత్తం రక్షణ ఉత్పత్తి  సుమారు రూ.74,739 కోట్లు కాగా అందులో రూ.16,411 కోట్లు (22 శాతం వాటా) ప్రైవేటు సంస్థలకు చెందినదని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇదే అత్యధికం. 
 
ఈ సంవత్సరం ప్రైవేట్ రంగం రక్షణ ఉత్పత్తి 2022-23 కంటే రూ.21,083 కోట్లు తక్కువగా ఉంది. 2022-23 ప్రైవేట్ రంగం వాటా 19శాతం ఉంది. 2023-24లో రక్షణ ఉత్పత్తి గతం కంటే తగ్గడంతో ప్రైవేట్ రంగం వాటా పెరిగింది. భారత  రక్షణ ఉత్పత్తి 2022-23లో 1.09 ట్రిలియన్ కాగా, 2023-24లో రూ.74,739 కోట్లుగా ఉంది. 
ఆర్డినెన్స్  ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్ పబ్లిక్ రంగ సంస్థలు, ఇతర పి.ఎస్.యులు, జాయింట్ వెంచర్లతో కూడిన ఇతర విభాగాలు రక్షణ ఉత్పత్తి శాఖలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో అధిక రక్షణ కోసం ఒత్తిడి చేస్తోంది. ఉదాహరణకు నవంబర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ కొనుగోలు బడ్జెట్‌లో స్థానిక కంపెనీల కోసం సుమారు 1 ట్రిలియన్ (75 శాతం) ప్రభుత్వం రిజర్వ్ చేసిందని చెప్పారు. ఆఫ్‌సెట్ విధానం కూడా సహాయపడుతుందని భావిస్తున్నారు.
 
డిఫెన్స్ ఆఫ్‌సెట్‌ విధాన స్థానిక పరిశ్రమ అభివృద్ధికి, సాంకేతికత బదిలీని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. విదేశీ కంపెనీలు దేశీయ సంస్థలలో పెట్టుబడులు లేదా వాటి నుండి కొనుగోళ్ల ద్వారా స్థానికంగా పెద్ద ఆర్డర్‌ల కోసం పొందే డబ్బులో కొంత భాగాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.  2023- 24 నాటి రక్షణ ఆఫ్‌సెట్ మొత్తం విలువ  7.9 బిలియన్ల డాలర్లు. దీనిని 2019-20 (2.9 బిలియన్ల)తో పోల్చుకుంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది.  ఆఫ్‌సెట్ కోసం కంపెనీలు చేసిన అనేక క్లెయిమ్‌ల  ఇప్పటికీ ప్రాసెస్ చేయబడలేదు, అవి తదుపరి సమీక్ష కోసం ప్రభుత్వానికి సమర్పించబడతాయి. 
 
అవసరమైన అదనపు సమాచారం కోసం  లేదా అసంపూర్ణంగా ఉన్నందున ప్రభుత్వానికి సమర్పించే క్లెయిమ్‌ల సంఖ్య మార్చి 2020లో $790 మిలియన్ల నుండి ఏప్రిల్ 3 నాటికి దాదాపు $310 మిలియన్లకు తగ్గింది.  జనవరిలో నమోదైన $301 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్ సంఖ్య స్వల్ప పెరుగుదలను చూపుతుంది. 
 
భారతదేశ రక్షణ ఎగుమతులు 2022-23లో 15,920 కోట్లు ఉండగా, అది  2023-24లో రికార్డు స్థాయిలో సుమారు రూ.21,083 కోట్లకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  ప్రయివేటు రంగం కూడా కొత్త రక్షణ ఉత్పత్తి సౌకర్యాలలో పెట్టుబడులు పెడుతోంది.  
 
కాన్పూర్‌లో చిన్న ఆయుధాల తయారీ, నోయిడాలో ఎలక్ట్రో-ఆప్టిక్స్ సౌకర్యాల కొరకు ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్‌ కు సుమారు రూ.25,397 కోట్ల పెట్టుబడుల ప్రకటనలు వచ్చాయి. రక్షణ గేర్లు, ఫోటోనిక్స్, థర్మల్ ఇమేజింగ్, ఏరోస్పేస్ కాంపోనెంట్‌లు, రాడార్ సౌకర్యాల కోసం సుమారు రూ. 11,821 కోట్ల విలువైన పెట్టుబడులు తమిళనాడు డిఫెన్స్ కారిడార్‌లో పెట్టారు.