ఎన్డీఏ కూటమికి 399 సీట్లు.. కాంగ్రెస్‌కు కేవలం 38 సీట్లు

* ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్
దేశంలో ప్రస్తుతఎన్నికలలో  బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టే పరిస్థితి కనిపిస్తోంది. సర్వేలు అన్ని దాదాపు ఇదే విషయం చెబుతున్నాయి. తాజాగా ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియల్ పోల్ కూడా ఇదే విషయం వెల్లడించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 399 సీట్లు సాధిస్తోందని అంచనా వేసింది. 
 
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఒంటరిగా 342 సీట్లు సాధిస్తోందని వివరించింది. ఇండియా బ్లాక్ కూటమి కేవలం 94 సీట్లు మాత్రమే గెలుస్తోందని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, బీజేడీ, ఇతరులు 50 సీట్ల వరకు గెలుచుకుంటారని తెలిపింది.
 
మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 543 లోక్ సభ నియోజకవర్గాల్లో లక్ష 79 వేల 190 మంది నుంచి అభిప్రాయం తీసుకున్నామని ఇండియా టీవీ సర్వే వివరించింది. ఇందులో పురుషులు 91 వేల 100 మంది ఉండగా మహిళలు 88 వేల 90 మంది ఉన్నారు. మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 543 లోక్ సభ నియోజకవర్గాల్లో లక్ష 79 వేల 190 మంది నుంచి అభిప్రాయం తీసుకున్నామని ఇండియా టీవీ సర్వే వివరించింది. ఇందులో పురుషులు 91 వేల 100 మంది ఉండగా మహిళలు 88 వేల 90 మంది ఉన్నారు.

బీజేపీకి 342 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 38 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. టీఎంసీ 19, డీఎంకే 18, జేడీయూ 14, టీడీపీ 12, ఆప్ 6, ఎస్పీ 3, ఇతరులు 91 సీట్లను గెలుచుకుంటారని వివరించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖంగడ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అన్ని సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని తెలిపింది.

లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బలపడనుంది. టీడీపీకి 12 సీట్లు, వైసీపీకి 10 సీట్లు, బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంటుందని వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడనుంది. ఏకంగా 9 సీట్లు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. బీజేపీ 5, బీఆర్ఎస్ 2, మజ్లిస్ ఒక సీటు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత అద్భుతమైన విజయం సాధించబోతోంది, ఇక్కడ బిజెపి 73 సీట్లు గెలుచుకోవచ్చు.  దాని కూటమి భాగస్వాములు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి), అప్నాదళ్ (ఎస్) మొత్తం 80 సీట్లలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు.  మిగిలిన మూడు స్థానాలను సమాజ్‌వాదీ పార్టీకి వదిలిపెట్టింది. యుపిలో కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రెండూ ఖాళీ కావచ్చు.

బీహార్ (40కి 17), జార్ఖండ్ (14కి 12), కర్ణాటక (28కి 22), మహారాష్ట్ర (48కి 27), ఒడిశా (21కి 10) బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించబోతున్న ఇతర రాష్ట్రాలు. అస్సాం (14 లో 11), పశ్చిమ బెంగాల్ (42 లో 22),  11 . ప్రాంతీయ పార్టీలలో, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 19 సీట్లు, తమిళనాడులో డీఎంకే 18 సీట్లు, వైఎస్సార్‌సీపీ 10, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 12 సీట్లు, బిజూ జనతాదళ్ (బీజేడీ) ఒడిశాలోని 21 సీట్లలో 11 సీట్లు గెలుపొందవచ్చు.