బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయిన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బిహార్లో పర్యటించారు. బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.
సభ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో అమిత్ షా హెలీకాప్టర్‌లో బయలుదేరారు. ఈ సమయంలోనే హెలీకాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పింది. గాల్లోకి కొద్దిగా ఎగిరిన హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో కొద్దిసేపు అక్కడే చక్కర్లు కొట్టింది. అనంతరం చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ హెలికాప్టర్‌ను సురక్షితంగా గాల్లోకి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
అమిత్ షా ఎక్కిన తర్వాత హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా బ్యాలెన్స్ తప్పింది. దీంతో ఆ హెలికాప్టర్ కొన్ని క్షణాల పాటు గాల్లో అక్కడే చక్కర్లు కొట్టింది. చివరికి ఆ పైలట్ హెలికాప్టర్‌ను సురక్షితంగా టేకాఫ్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాకు ఏర్పాటుచేసిన హెలీకాప్టర్‌కు సంబంధించిన వివరాలను సైతం అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాలెన్స్ కోల్పోవడానికి కారణాల తెలియరాలేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు అమిత్ షా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్‌లో హెలికాప్టర్ ఇలా జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇక ఈ ప్రమాదం జరగడానికి ముందు బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. కాశ్మీర్ అంశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్ 70 ఏళ్లుగా ఆర్టికల్ 370 ని వారి అక్రమ సంతానంగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఆర్టికల్ 370 ని రద్దు చేశామని చెప్పారు. పొరపాటున ఇండియా కూటమి గెలవదని, భారత్‌కు బలమైన వారు కావాలని.. బలహీనులు కాదన్నారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మంధాన