18మందితో జాబితా విడుదల చేసిన జనసేన

ఏపీ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలు దక్కాయి. 21 స్థానాల్లో ఆదివారం 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల అభ్యర్థులకు ఇంకా పేర్లు ఖరారు చేయాల్సి ఉంది.

వంశీకృష్ణ యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పేరును ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. పాలకొండకు పడాల భూదేవి పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరీ, బీ రామకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. 

కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా తంగెళ్లను ఉదయ్‌ శ్రీనివాస్‌ పేరును ప్రకటించింది. బందర్‌ పార్లమెంట్‌ స్థానానికి సైతం అభ్యర్థి ఎంపికను పెండింగ్‌లో పెట్టింది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

జనసేన అభ్యర్థుల లిస్ట్‌..

నెల్లిమర్ల-లోకం మాధవి
అనకాపల్లి–కొణతాల రామకృష్ణ
పిఠాపురం- పవన్ కల్యాణ్‌
కాకినాడ రూరల్– పంతం నానాజీ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
తెనాలి – నాదెండ్ల మనోహర్
నిడదవోలు – కందుల దుర్గేశ్‌
పెందుర్తి – పంచకర్ల రమేశ్‌ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
పీగన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయక్
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు
తిరుపతి – ఆరణి శ్రీనివాస్
రైల్వే కోడూరు – డాక్టర్‌యనమల భాస్కరరావు