నిప్పుల గండంగా మారిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలుమండిపోతున్నాయి. తెల్లవారడమే అధిక ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. సూర్యోదయం నుంచే వేసవి తీవ్ర కనిపిస్తోంది.  వాతావరణంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.  ఆదివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైయస్సార్ జిల్లా చాపాడులో 45.9° డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
10 రోజులుగా  సూర్యుని ప్రతాపానికి జనం బయటకు రావడానికి అల్లాడుతున్నారు. మరో 10 రో జుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మ రింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. నేడు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎం డలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందువల్ల ప్రజలు మధ్యాహ్నం తర్వాత బయటకి రావద్దని వాతావరణ శాఖ సూచించింది.

కర్నూలు జిల్లా గూడూరులో 45.5° డిగ్రీలు, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.2°డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా మక్కువలో 45.1°డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మంగళవారం 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు,159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

ఎండల తీవ్రతకు తెలంగాణ భగభగలాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా దాదాపు ఐదు డిగ్రీల అధికంగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా 45డిగ్రీలను దాటి ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం తెలంగాణలో ఆరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములు, జయశంకర్‌ భేపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో 45 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మహబూబాబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది మరోవైపు తెలంగాణలో నేడు రేపు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖం అంచనా వేసింది.