బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో మాజీ పోలీస్‌ అధికారికి జీవిత ఖైదు

రాంనారాయణ్ గుప్తా 2006 బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో బాంబే హైకోర్టు మంగళవారం మాజీ పోలీసు ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. రాంనారాయణ్‌ గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు సన్నిహితుడిగా ఆరోపణలున్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ రేవతి మోహిత్ డేరే, జస్టిస్ గౌరీ గాడ్సేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఎన్‌కౌంటర్ కేసులో ఓ పోలీస్ అధికారి దోషిగా నిర్దారణ కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి.
 
డివిజన్ బెంచ్ 2013లో ప్రదీప్ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు అన్యాయమని పేర్కొంది. ప్రదీప్‌ శర్మకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా దిగువ కోర్టు పట్టించుకోలేదని హైకోర్టు పేర్కొంది.  ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని అనేక ఆధారాలు రుజువు చేస్తున్నాయని తెలిపింది. మాజీ పోలీస్‌ అధికారి లొంగిపోయేందుకు మూడువారాల్లోగా సంబంధిత సెషన్‌ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. 

ఎన్‌కౌంటర్‌ కేసులో 13 మంది పోలీసులతో సహా 22 మందిపై అభియోగాలు మోపారు. దిగువ కోర్టు పోలీసులతో సహా 14 మందికి జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. డివిజన్ బెంచ్ ఆరుగురు నిందితుల జీవిత ఖైదును రద్దు చేస్తూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 2013లో సెషన్స్‌ కోర్టు సాక్ష్యాలు లేకపోవడంతో ప్రదీప్‌ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ 21 మందిని దోషులుగా నిర్ధారించింది. 21 మందిలో ఇద్దరు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు.

నిందితులు తమకు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శర్మను నిర్దోషిగా విడుదల చేయడంపై ప్రాసిక్యూషన్‌, మృతుడి సోదరుడు రాంప్రసాద్‌ గుప్తా అప్పీల్‌ దాఖలు చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు అధికారులే  పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డారని వాదించారు. ఈ కేసులో ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించాలని కోరుతూ ప్రాసిక్యూషన్, కిడ్నాప్, హత్యకు మాజీ పోలీసు ప్రధాన కుట్రదారని వాదించారు.

చివరకూ హైకోర్టు 12 మంది పోలీసు అధికారుల దోషులుగా నిర్దారించింది. ఆరుగురు పౌరులను నిర్దోషులుగా విడుదల చేసింది. ట్రయల్ కోర్టు తీరుపై మండిపడింది. స్పష్టమైన ఆధారాలున్నా నిందితులను నిర్దోషిగా ప్రకటించిందని పేర్కొంది.

18 ఏళ్ల కిందట 2006 నవంబర్‌ 11న రాంనారాయణ్‌ గుప్తా అలియాస్‌ లఖన్‌ భయ్యా, అతని స్నేహితుడు అనిల్‌ భేదాను ఛోటా రాజన్‌ ముఠా సభ్యులనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు. అదేరోజు సబర్బన్‌ వెర్సోవాలోని నానా నాని పార్క్‌ దగ్గర జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో గుప్తా ప్రాణాలు కోల్పోయారు.

ఇక, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించిన మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ.. తన 25 ఏళ్ల సర్వీసులో 112 మంది క్రిమినల్స్‌ను మట్టుబెట్టారు. ప్రదీప్ శర్మ గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఆంటీలియా ఎదుట పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులోనూ, మన్సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.