దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలపై పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్ అహ్మదాబాద్- ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని తెలిపారు.
మొదటగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నట్లు చెప్పారు. 2028 నాటికి ముంబై – అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని వివరించారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తున్నది.
రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ భూసేకరణలో అడ్డంకులు ఎదురయ్యాయి. 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైలును నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక ఈ మొత్తం కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు.
‘బుల్లెట్ రైలు కోసం 500 కి.మీల ప్రాజెక్టును నిర్మించేందుకు పలు దేశాలకు దాదాపు 20సంవత్సరాలు పట్టింది. భారత్ మాత్రం 8-10 సంవత్సరాల్లోనే పూర్తిచేయనుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును పూర్తిచేస్తాం. 2026 నాటికి బుల్లెట్ రైలు పట్టాలెక్కనుంది. ముందుగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు నడపనున్నాం. 2028 నాటికి ముంబై-అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు
More Stories
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు
భారత మహిళల అండర్-19 జట్టు తొలి విజయం
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం