స్మృతి ఇరానీ పై పరువు నష్టం కేసు కొట్టివేత

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై షూట‌ర్ వ‌ర్తికా సింగ్ వేసిన ప‌రువున‌ష్టం పిటీష‌న్‌ను అల‌హాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ల‌క్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జ‌ర్న‌లిస్టులు వేసిన పిటీష‌న్‌కు కోర్టు స్పందిస్తూ, ఒక‌వేళ పిటీష‌న‌ర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది ప‌రువున‌ష్టం కేసు కింద‌కు రాదు అని బెంచ్ పేర్కొన్న‌ది. 
 
ఫ‌యాజ్ ఆల‌మ్ ఖాన్‌కు చెందిన బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. మార్చ్ 5వ తేదీన వ‌చ్చిన ఆ తీర్పును సోమ‌వారం కోర్టు సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అంత‌ర్జాతీయ షూట‌ర్ వ‌ర్తికా సింగ్ .. సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ప‌రువున‌ష్టం కేసును ఫైల్ చేశారు. 
 
2022, అక్టోబ‌ర్ 21వ తేదీన స్పెష‌ల్ కోర్టు ఆ కేసును ర‌ద్దు చేసింది. అయితే ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ పిటీష‌న‌ర్ హైకోర్టును ఆశ్ర‌యించారు. కేంద్ర మంత్రి ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ గురించి ఓ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌శ్న వేసిన స‌మ‌యంలో.. మంత్రి స్మృతి దానికి సమాధానం ఇస్తూ పిటీష‌న‌ర్ కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మ అని, గాంధీ కుటుంబంతో ఆమెకు నేరుగా లింకులు ఉన్న‌ట్లు ఆరోపించారు.అయితే ఆ ,ఎక్క‌డ కూడా పిటీష‌న‌ర్ పేరును మంత్రి స్మృతి ఇరానీ ప్ర‌స్తావించ‌లేద‌ని కోర్టు తెలిపింది. మంత్రి స్మృతి ఇరానీ ఆ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో కేవ‌లం రాజ‌కీయ పార్టీని విమ‌ర్శిస్తోంద‌ని, పిటీష‌న‌ర్‌ను కించ‌ప‌రుచాల‌న్న ఉద్దేశం ఆమెకు లేద‌ని బెంచ్ త‌న తీర్పులో పేర్కొన్న‌ది.