* బిజెపి రాజ్యసభ జాబితాలో ఇద్దరు కేంద్ర మంత్రులతో ఐదుగురు
కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ బుధవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి ఆమె తన నామినేషన్ ఫైల్ చేశారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా, అశోక్ గెహ్లాట్, గోవింద సింగ్ దోస్తాలు ఉన్నారు.
రాయ్‌బరేలి నుంచి ఎంపీగా ఐదు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభ పోటీలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక 1999లో తొలిసారి సోనియా ఎంపీగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకోగలదు.
అంతకు ముందు రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్రం నుంచి చంద్రకాంత్ హాండోర్ నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించింది.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. ఒడిశా నుంచి వైష్ణవి అశ్విని వైష్ణవ్ పేరును పార్ట ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన మరో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తిరిగి మధ్య ప్రదేశ్ నుండి పోటీ చేస్తారు.
మధ్యప్రదేశ్ నుంచి నలుగురు అభ్యర్థులను, ఒడిశా నుంచి ఒకరిని పేర్లను వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, ఉమేశ్ నాథ్ మహరాజ్, మయ నారోల్య, బన్సీలాల్ గర్జర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో స్మృతి మంధాన