రిపబ్లిక్‌ డే రోజున జమ్మూ ప్రాంతానికి ఉగ్ర ముప్పు !

* ఢిల్లీలో దట్టమైన పొగమంచు ప్రభావం

రిపబ్లిక్‌ డే రోజున జమ్మూ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం అందింది.  ఈ నెల 26న కశ్మీర్‌లో లోయలో దాడికి యత్నించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఈ మేరకు కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సైతం నిఘా సంస్థలు సమాచారం అందించాయి.

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా జమ్మూ కాశ్మీర్‌లో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని లోయలో ప్రస్తుతం ఉన్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ఉగ్రవాద సంస్థ ప్లాన్‌ చేసింది.  జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోకి చొరబడి దాడికి పాల్పడాలని లష్కరే సంస్థకు తోడు పాక్‌ మద్దతు ఉన్న నాలుగు ఉగ్ర సంస్థలు సైతం ప్రయత్నిస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అందిన సమాచారం ప్రకారం లష్కరేకు చెందిన ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు సాంబా సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నది. పాక్‌ రేంజర్ల సహాయంతో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రిపబ్లిక్‌ డే నేపథ్యంలో పాక్‌ కుట్రలు పన్నుతుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జనవరి 26న పాక్‌ తన ఉగ్రసంస్థలను మరోసారి యాక్టివ్‌ చేసింది. 

లోయలో వాతావరణాన్ని చెడగొట్టేందుకు లష్కరే తొయిబాతో పాటు మరో రెండు రెండు ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ సిద్ధం చేసినట్లుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వర్గాలు తెలిపాయి. ఐబీకి అందించిన సమాచారం మేరకు ఈ ఉగ్రవాదులు రెండు రోజుల కిందట సైతం చొరబాటుకు యత్నించారు. ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. 

ఫలితంగా ఉగ్రవాదులు తిరిగి వెళ్లి పాక్‌ రేంజర్ల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా నలుగురు ఉగ్రవాదులు చొరబడేందుకు పాక్‌ మరోసారి కుట్ర పన్నిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో చొరబాట్లను నిరోధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. 

అయితే, ఉగ్రదాడులతో పాటు ఇతర సంస్థలతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు పాక్‌ ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. సమాచారం మేరకు పాక్‌ ప్రోద్బలంతో ఆల్‌ పార్టీ హురియత్‌ కాన్ఫరెన్స్‌ జనవరి 26న బ్లాక్‌ డే జరిపేందుకు పోస్టర్లను సైతం విడుదల చేసింది.  జమ్మూ కశ్మీర్ నేషనల్ ఫ్రంట్ సైతం లోయలో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసే పని ప్రారంభించిందని నిఘా వర్గాలు సమాచారం అందింది.

ఉగ్రవాదులతో పాటు లోయలోని నాలుగు నిషేధిత సంస్థలను సైతం క్రియాశీలం చేసి.. ప్రశాంత వాతావరణం భగ్నం చేసే పనిని పాక్‌ అప్పగించిందని కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది.  నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి కుట్ర జరిగినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనంగా బలగాలను మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మరోవంక, దలేహీలో దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ (దృశ్యమాన్యత) 75వ రిపబ్లిక్‌ వేడుకలపై ప్రభావం చూపవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం తెలిపింది. పొగమంచు కారణంగా శుక్రవారం ఉదయం 8.30 గంటలకు విజిబిలిటీ 400 మీటర్లు ఉంటుందని పేర్కొంది. పది గంటలకు 1,500 మీటర్లు మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 7 డిగ్రీలకు పడిపోయాయని ప్రకటించింది.