ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలుచేస్తామని చెబుతూ కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ఖజానాను గుల్ల చేసిందని, అందుకే హామీ అమలు ఆలస్యం అవుతుందని తెలిపారు. 
 
ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ కావాలనే హడావుడి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని హామీలు నిలబెట్టుకుందో చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగ భృతి, డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల వ‌ర‌కు అన్ని హామీల‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
 
నిరుద్యోగ భృతి, డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల వ‌ర‌కు అన్ని హామీల‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా? కేటీఆర్ ఇంటికి పంపాలా? అని ప్రశ్నించారు. పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతల్లాగా తాము ప్రజల్ని రెచ్చగొడితే ఫామ్ హౌస్ దాటకపోయే వారని హెచ్చరించారు. కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో అక్రమాల‌పై విచార‌ణ కొన‌సాగుతుందని చెబుతూ హామీల అమలుపై ఇవాళ సమీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు.