
మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం లేత పసుపు, క్రీమ్ కలర్ దుస్తులు, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాలను అలంకరిస్తారు. బాల రాముడి కోసం పుణేలోని హెరిటేజ్ అండ్ హ్యాండ్ వీవింగ్ రివైవల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేనేత వస్త్రాలను అయోధ్య ట్రస్ట్ అందించనున్నది.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో మంగళవారం నుంచి బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుంచి గర్భగుడి శుద్ధి, పూజ, అలంకరణకు సన్నాహాలు చేస్తారు. 3.30 నుంచి 4 గంటల వరకు, బాల రాముడిని, శ్రీయంత్రాన్ని వేదమంత్రాలతో మేల్కొలుపుతారు. అనంతరం మంగళ హారతి ఉంటుంది. అనంతరం కుంకుమార్చన, అలంకారం ఉంటుంది. ఆ తర్వాత శృంగార హారతి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు భోగ్ హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రెండు గంటల పాటు దర్శనాలను నిలిపివేస్తారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. సాయంత్రం ఏడు గంటలకు మరోసారి హారతి ఉంటుంది. రాంలాలా ఆరతి రోజుకు మూడు సార్లు నిర్వహిస్తారు. మొదటిది ఉదయం 6:30 గంటలకు, దీనిని జాగ్రన్ లేదా శృంగార్ ఆర్తి అంటారు. రెండవది మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ్ ఆరతి అని.. మూడవది రాత్రి 7:30 గంటలకు సంధ్యా ఆరతి అని పిలుస్తారు. ఆరతిలో 30 మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వారు తప్పనిసరిగ్గా ముందుగా పాస్ తీసుకోవాలి.
ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకొనేందుకు అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. లాగిన్ చేయడానికి మొబైల్ నంబర్‌ని ఉపయోగించి, మొబైల్‌కి పంపిన ఓటీపీతో ఐడీని ధృవీకరించాలి. ‘మై ప్రొఫైల్’ విభాగంలో గుర్తించి, క్లిక్ చేయండి. ఆరతి లేదా దర్శనం కోసం ఇష్టమైన స్లాట్‌ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలను అందించి, బుకింగ్‌ను పూర్తి చేయడానికి, పాస్‌ను పొందేందుకు ప్రాంప్ట్‌లను అనుసరించాలి. బుకింగ్ విజయవంతమైన తర్వాత నిర్ధారణను స్వీకరించాలి. ఆలయంలో ప్రవేశానికి ముందు ఆలయ కౌంటర్ నుండి పాస్‌ను తీసుకోవాలి.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు