గర్భగుడిలో ఆసీనుడైన అయోధ్య బలరాముడు

అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రామ్ లల్లా (బాలరాముడు) ప్రవేశించారు. రామ్ లల్లా ఐదేళ్ల బాలుడిగా దర్శనం ఇస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండనుందో అనే సందేహాం ప్రతి ఒక్కరిలో నెలకొంది. బాల రాముడి విగ్రహ ఫొటోను ఓ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసింది. 51 అంగులాల పొడవు ఉన్న విగ్రహం పై భాగాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచారు.

శ్రీరాముడి విగ్రహం ఫొటోలను విశ్వ హిందూ పరిషత్ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ విడుదల చేశారు. గర్భగుడిలో ప్రతిష్ఠించిన అనంతరం బయటికొచ్చిన మొట్ట మొదటి ఫొటోలు ఇవి. అయితే, ఈ విగ్రహం ముఖం, పైభాగాన్ని వస్త్రాలతో కప్పి ఉంచారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున వాటిని తొలగిస్తారు.ఆ విగ్రహం సుందరంగా కనిపించింది.
యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న ఐదేళ్ల పిల్లవాడిగా చిత్రీకరించారు. కమలం, హాలో కారణంగా, విగ్రహం 150 కిలోగ్రాముల బరువు ఉంటుందని, భూమి నుండి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు ఏడు అడుగులు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. నల్లటి పద్మపీఠంపై బాలరాముడు దర్శనిమచ్చాడు. మరోవైపు నేడు అయోధ్యలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బాలరాముడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ప్రాణ ప్రతిష్ట ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.
బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చే సమయంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రామ నామాన్ని స్మరించారు. రామ్ లల్లా విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ అందంగా తీర్చిదిద్దారు. గురువారం ఉదయం రాముడి విగ్రహాన్ని పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు. తర్వాత గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొన్నారు. 

ఈ నెల 22వ తేదీన బాల రాముడి విగ్రహానికి ఉన్న కళ్ల గంతలను విప్పుతారు. ప్రధాని మోదీ రామ్ లల్లాను దర్శించుకొని హారతి ఇస్తారని అయోధ్య ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా దేశం మొత్తం రామ జపం చేస్తూ రామ కీర్తలనతో మరోమోగిపోతుంది. అయోధ్య మొత్తం రామ కీర్తలనల్తో , రాముడి చిత్రాలతో నిండిపోయింది. ఎటు చేసిన భక్తులతో కనువిందుగా కనిపిస్తుంది. 

అయోధ్యలో రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపద, చూడగానే ఆకట్టుకునే హంగులతో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది.  అంతేకాదు ఆలయాన్ని ప్రారంభించేందుకు ఖరారు చేసిన ముహుర్తానికి సమయం దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే రామ మందిర ప్రారంభ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇంటిటికి రాముడి అంక్షింతలు చేరుకున్నాయి.