ప్రపంచ నేతలు, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక రంగ నేతలు దావోస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి తిరిగి మరోమారు ప్రధానిగా ఎన్నికైతే స్వాగతం పలికేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) వార్షిక సమావేశం 2024లో ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఏడాది ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి గద్దె ఎక్కుతారని ప్రపంచ నేతలు దృఢ నమ్మకంతో ఉన్నారని, మోదీ విధానాలు, సామాజిక సంస్కరణలు కొనసాగుతాయని వారు ఎదురుచూస్తున్నారని భావిస్తున్నారని ఆమె చెప్పారు.
దావోస్‌కు వచ్చిన ప్రపంచ నేతలు భారత్‌ను దృఢమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా పరిగణిస్తున్నారని ఆమె చెప్పారు. మోదీ 2018లో డబ్లుఇఎఫ్ వార్షిక సమావేశానికి హాజరయ్యారు. ఆయన 2021, 2022లో కూడా ఆన్‌లైన్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర మహిళా, శిశు వికాస, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ ప్రస్తుత 2024 వార్షిక సమావేశంలో భారత ప్రతినిధివర్గానికి సారథ్యం వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ, వాణిజ్య, విద్యా, కళా, సాంస్కృతిక, పౌర సమాజ ప్రముఖులు సుమారు 3000 మంది హాజరవుతున్నారు.
ఆర్ధిక పురోగతికి `లైంగిక న్యాయం’ అత్యవసరమని భారత్ గట్టి వాదన వినిపిస్తోందని చెబుతూ మహిళల నేతృత్వంలోని అభివృద్ధిలో మీరు పెట్టుబడి పెడితే, మీరు బలమైన ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెడితే, మీరు మీ దేశ ఆరోగ్య సంరక్షణ రంగానికి, మీ దేశ విద్యా రంగానికి పురోభివృద్దికోసం బలమైన ఉద్దేశ్యంతో పెట్టుబడి పెట్టిన్నట్లు అవుతుందని ప్రధాని మోదీ తెలిపారని ఆమె గుర్తు చేశారు.
ఒక మహిళ కొనుగోలు శక్తి, వినియోగ శక్తి ఒక స్కేల్‌ను కలిగి ఉన్నప్పుడు, ఆమె ఈ రెండు ముఖ్యమైన విభాగాలపై తన డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తుందని ఇరానీ చెప్పారు. ప్రపంచ నేతలతో తన చర్చల గురించిన ప్రశ్నకు మంత్రి ఇరానీ సమాధానం ఇస్తూ, వారు భారత అభివృద్ధి గాథ గురించి దృఢనమ్మకంతో ఉన్నారని, దేశంలో విధానం, రాజకీయ సుస్థిరత గురించి భరోసాతో ఉన్నారని తెలియజేశారు.
ప్రధాని మోదీ 2025లో దావోస్ సమావేశానికి తిరిగి హాజరవుతారని తాను ఆశిస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు (బోర్గె బ్రెండె) కూడా బాహాటంగా ఒక ఇంటర్వూలో చెప్పారని ఇరానీ తెలిపారు. ‘అంటే ప్రధాని మోదీ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రపంచ సమాజం గట్టి భరోసాతో ఉందని విదితం అవుతోంది’ అని ఆమె చెప్పారు. ‘ప్రధాని మోదీ విధాన సంస్కరణలపైనే కాకుండా సామాజిక రంగాన్నీ మన వృద్ధి గాథలో అలక్షం చేయకుండా చూడాలని పట్టుదలతో ఉన్నారు’ అని ఇరానీ తెలిపారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!