తైవాన్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డ్రాగ‌న్‌కు చుక్కెదురు

తైవాన్‌ను ఆక్ర‌మించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న డ్రాగ‌న్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. తైవాన్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అధికార డెమోక్ర‌టిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) అభ్య‌ర్థి లాయి చింగ్ తే విజ‌యం సాధించారు. యుద్ధం, శాంతి మ‌ధ్య ఏది కావాలో ఎంచుకోవాల‌ని తైవాన్ ఓట‌ర్ల‌కు చైనా సూచించింది.  పక్కలో బల్లెంగా ఉన్న చైనా ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ విలియంకే ప్రజలు బహిరంగంగా మద్దతు తెలిపారు.
 
ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం విజయంకు 40.2శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు 98శాతం పూర్తయ్యిందని అల్‌ జజీరా పేర్కొంది. ఎన్నికల్లో విజయం సాధించిన విలియంకు ప్రత్యర్థి హౌ యు-ఇహ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి హౌ యు ఇహ్‌కు 33.4 శాతం ఓట్లు పోలయ్యాయి. అధికారం నుంచి తొలగించడంలో విఫలమైనందుకు హౌ తన మద్దతుదారులకు క్షమాపణలు చెప్పారు.
 
ప్రస్తుత తైవాన్ అధ్యక్షురాలు త్సయి ఇంగ్-వెన్ స్థానంలో లయ్ చింగ్ బాధ్యతలు చేపడతారు.  తైవాన్ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందిన త్సయి తమ దేశ స్వయంప్రతిపత్తికి కట్టుబడి చైనాను ధిక్కరించారు. ఇది డ్రాగన్‌కు ఆగ్రహం తెప్పించింది. 2016, 2020 ఎన్నికల్లో విజయం సాధించిన త్సయి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమె వారసుడిగా లయ్ చింగ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 
 
లాయి చింగ్ తేకు ఓటేయొద్ద‌ని, ఆయ‌న్ను తిర‌స్క‌రించాల‌ని చైనా జారీ చేసిన హెచ్చ‌రిక‌లు తైవాన్ పౌరులు తోసిపుచ్చారు. దీంతో మ‌రోమారు డీపీపీ అధికారంలోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. తైవాన్ డెమోక్ర‌టిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తొలి నుంచి వేర్పాటువాద ఐడెంటిటీని క‌లిగి ఉండ‌టంతోపాటు తైవాన్ త‌మ భూభాగం త‌మ‌దేన‌ని చైనా వాద‌న‌ను తోసిపుచ్చుతున్న‌ది.
 
ప్ర‌స్తుతం డెమోక్ర‌టిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ఉపాధ్య‌క్షుడిగా ఉన్న లాయి చింగ్‌తే అసాధార‌ణ రీతిలో మూడోసారి విజ‌యం సాధించారు. లాయి చింగ్ తేకు వ్య‌తిరేకంగా తైవాంగ్‌లోనే అతిపెద్ద విప‌క్ష పార్టీ కొమింటాంగ్ (కేఎంటీ) పార్టీ త‌ర‌ఫున హౌ యూఐ, తైపై పీపుల్స్ పార్టీ కి చెందిన కో వెన్ జీ ఓట‌మి పాల‌య్యారు. 
 
లాయి చింగ్‌తేను ప్ర‌మాద‌క‌ర వేర్పాటువాదిగా చైనా ప్ర‌క‌టించింది. తైవాన్ కోసం స్వ‌తంత్య్రం కోసం ప్ర‌య‌త్నిస్తే యుద్ధం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. లాయి చింగ్‌తే చ‌ర్చ‌ల ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే తాను శాంతినే కోరుకుంటున్నాన‌ని, అదే స‌మ‌యంలో ద్వీప‌క‌ల్పం చుట్టూ ర‌క్ష‌ణ బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తామ‌ని చెప్పారు.
 
కాగా, చర్చల కోసం విలియం లాయ్ చేసిన విజ్ఞప్తికి చైనా స్పందించలేదు. అయినా ఆయన విలియం శాంతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. చైనా బెలూన్లు జలసంధిని దాటుతున్నట్లు కనిపించిందని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాతో షరతులతో కూడిన ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తైవాన్ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విలియం స్పష్టం చేశారు. తైవాన్ పార్లమెంట్‌లో 113 సీట్లు ఉన్నారు.
 
తైవాన్‌పై యుద్ధమేఘాలు
 
మరోవంక, చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. తైవాన్‌లో శనివారం జరిగిన ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తైవాన్‌ను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్న చైనా ఇప్పటికే ఉచ్చు బిగుస్తున్నది. 
 
ద్వీపకల్పాన్ని అష్టదిగ్బంధనం చేసిన చైనా ఆ దేశ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో తైవాన్‌లోని బ్యాంకులు మూతపడుతున్నాయి. ప్రజలు కోట్ల రూపాయల లావాదేవీలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. తైవాన్‌లోని ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెమికండక్టర్‌ పరిశ్రమ స్తంభించిపోయింది. 
 
చైనా ప్రత్యక్షంగా తన సేనలను పంపడం తప్ప మిగిలిన అన్ని విధాలుగా తైవాన్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నది. చైనా ప్రత్యక్షంగా దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ.828 లక్షల కోట్ల నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్‌ దుండగులు తైవాన్‌ ప్రభుత్వ, రక్షణ సంస్థలనే కాకుండా అక్కడి సెమికండక్టర్‌ పరిశ్రమను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 
 
ప్రపంచ ఆర్థికవ్యవస్థకు జీవనాడిగా పేర్కొనే చిప్స్‌ సరఫరాలో తైవాన్‌ కంపెనీలు కీలకంగా ఉన్నాయి. సెమికండక్టర్‌ పరిశ్రమలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అవసరమైతే ధ్వంసం చేస్తాం తప్ప వాటిని చైనా దళాల చేతిలో పడనివ్వబోమని అమెరికాకు చెందిన ఓ అధికారి గత ఏడాది అన్నారు.