గత రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని బ్యాంకు ఖాతాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గత రెండేళ్లుగా లావాదేవీలు జరపని బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేదంటూ వాటిపై రుసుం విధించవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయా ఖాతాలు వాడుకలో లేవు అని బ్యాంకులు గుర్తిస్తే ఆ విషయాన్ని ఖాతాదారులకు ఫోన్ సందేశాలు, లేఖ, ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించింది.
ఖాతాదారులు అందుబాటులో లేకపోతే వారి నామినీకి ఆ సమాచారం అందించాలని పేర్కొంది. విద్యార్థులు ఉపకార వేతనాల కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన బ్యాంకు ఖాతాలు రెండేళ్లకు పైబడి వాడుకలో లేకపోయినా, వాటిని నిరుపయోగ ఖాతాలుగా గుర్తించరాదని ఆర్బీఐ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ తాజా మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు స్పందించింది. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడంలో భాగంగానే తాజా సర్క్యులర్ జారీ చేసింది.

More Stories
కరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు
గతేడాదితో పోలిస్తే 5.7 శాతం పెరిగిన నకిలీ నోట్లు
రూపాయి మారకం రేటు పతనాన్ని ఆర్బీఐ అడ్డుకోవద్దు