అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లేందుకు 72 రైళ్లు

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. 23 నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు అయోధ్య చేరుకునేందుకు వీలుగా కొత్తగా రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. 
 
ఇందులో ఏసీ నుంచి స్లీపర్‌, జనరల్ వరకు అన్ని తరగతుల రైళ్లు ఉండనున్నాయి. రాబోయే రోజుల్లో అయోధ్య వైపు నడిచే కొత్త రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను రైల్వేశాఖ ఖరారు చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో డైలీతో పాటు వీక్లీ ట్రైన్స్‌ సైతం ఉన్నాయి. ఇక జనవరి 22 నుంచి ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా 37 అదనంగా రైళ్లను రైల్వేశాఖ నడుపనున్నది.

దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు నడువనున్నాయి. రామాలయానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తున్నది.  రైళ్ల ద్వారా అయోధ్యను దేశంలోని పెద్ద నగరాలతో అనుసంధానించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దీంతో భక్తులు రామాలయానికి చేరుకోవడం మరింత సులభంగా కానున్నది. డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.  అయోధ్య స్టేషన్‌ను సైతం మరింత విస్తరించేందుకు అవకాశం ఉన్నది. కొత్త స్టేషన్‌లో రోజుకు 50వేల మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం రైల్వేశాఖ రైళ్ల సంఖ్య, టైమ్‌ టేబుల్‌పై కసరత్తు చేస్తున్నది.

అయోధ్యకు నడుస్తున్న రైళ్లు

రైలు నెం.19165 సబర్మతి ఎక్స్‌ప్రెస్
రైలు నెం.14854 మరుధర్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.14206 అయోధ్య ఎక్స్‌ప్రెస్
రైలు నెం.12226 కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌
రైలు నెం.19321 ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్‌
రైలు నెం.14650 సరయు యమునా ఎక్స్‌ప్రెస్
రైలు నెం.13010 యోగా నగరి రిషికేష్ హౌరా ఎక్స్‌ప్రెస్
రైలు నెం.13308 గంగా సట్లజ్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.14222 కాన్పూర్ అన్వర్గంజ్ ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.13152 కోల్‌కతా ఎక్స్‌ప్రెస్
రైలు నెం.04204 అయోధ్య కంటోన్మెంట్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్
రైలు నెం.22550 వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15084 ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15054 ఛప్రా ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15667 కామాఖ్య ఎక్స్‌ప్రెస్
రైలు నెం.14236 బరేలీ వారణాసి ఎక్స్‌ప్రెస్
రైలు నెం.19167 సబర్మతి ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15116 లోక్‌నాయక్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.13238 పాట్నా ఎక్స్‌ప్రెస్
రైలు నెం.13484 ఫరక్కా ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15026 మౌ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15716 గరీబ్ నవాజ్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.19615 కవి గురు ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15623 కామాఖ్య ఎక్స్‌ప్రెస్
రైలు నెం.14018 రక్సాల్ సద్భావన ఎక్స్‌ప్రెస్
రైలు నెం.18104 టాటానగర్ జలియన్‌ వాలా బాగ్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.15024 యశ్వంత్‌పూర్ గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.19053 ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
రైలు నెం.09465 దర్భంగా క్లోన్ స్పెషల్‌ ట్రైన్‌
రైలు నెం.15635 గౌహతి ఎక్స్‌ప్రెస్