లాల్ చౌక్ లో విస్మయం కలిగించిన నూతన సంవత్సర సంబరాలు

దశాబ్దాలుగా ఉగ్రవాదంతో, తుపాకీ కాల్పులతో కకావికలాంగా ఉంటూ వస్తున్న  జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్ లో ఇటీవలి సంవత్సరాలలో మొదటిసారిగా, పర్యాటక శాఖ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. దిగ్గజ ఘంటా ఘర్ (క్లాక్ టవర్ ప్రాంతం) వద్ద ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించే పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. లాల్ చౌక్ వద్ద వాతావరణం ఆనందం, ఉత్సాహంతో నిండిపోయింది. వందలాది మంది స్థానికులు, పర్యాటకులు సంగీతానికి ఒక ప్రత్యేకమైన, పండుగ వేడుకకు గుర్తుగా గుమిగూడారు.  స్థానిక, పర్యాటక స్పందనల పట్లలాల్ చౌక్‌లో అపూర్వమైన నూతన సంవత్సర వేడుకలకు హాజరైనవారు ఆనందం వ్యక్తం చేశారు.
లాల్ చౌక్‌లో తొలిసారిగా ఇలాంటి ఉత్సవాలు జరగడం పట్ల స్థానిక నివాసి మహ్మద్ యాసిన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. కాశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకులు శ్రీనగర్‌లో వైబ్రెంట్ వేడుకలను చూసి ఆశ్చర్యం, ఉత్సాహం వ్యక్తం చేశారు. ఆర్గనైజ్డ్ మ్యూజికల్ ఈవెంట్ టూరిజం డిపార్ట్‌మెంట్ సంగీత కార్యక్రమం ఉత్సవాల్లో స్థానికులు, పర్యాటకులతో కలిసి వేడుక వాతావరణాన్ని జోడించింది.
సాంప్రదాయకంగా శ్రీనగర్‌లోని ముఖ్యమైన ప్రాంతం లాల్ చౌక్ అలంకరణలు, ఉల్లాసమైన కార్యకలాపాలతో నిండిపోయింది. ఇది మునుపెన్నడూ చూడని వాతావరణాన్ని సృష్టించింది.  శ్రీనగర్ మునిసిపల్ కమీషనర్, శ్రీనగర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ సీఈఓ అథర్ అమీర్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఒక అద్భుతమైన మార్పు చూస్తున్నట్లు అభివర్ణించారు.
సోషల్ మీడియా పోస్ట్‌లో, ఆయన శ్రీనగర్ స్క్వేర్, లాల్ చౌక్‌లోని వైబ్రేషన్,  వేడుకలను ప్రస్తావిస్తూ మొదటిసారిగా ప్రజలు ఈ విధంగా బహిరంగంగా ఉత్సాహభరితంగా సంబరాలు జరుపుకోవడం చూస్తున్నట్లు తెలిపారు.   శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు ఈ సంబరాలకు మరింత ఉత్సాహవాతావరణం కలిగించింది.  2024 సంవత్సరం రాకను స్వాగతిస్తూ ప్రజలు నృత్యాలు, పాటలతో లాల్ చౌక్ ప్రాంగణం మారుమ్రోగింది.
బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్ పట్టణంలో లేజర్ షో, నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడంతో పండుగ ఉత్సాహం శ్రీనగర్‌ను దాటి విస్తరించింది.  పర్యాటక శాఖ ఆదివారం రాత్రి శ్రీనగర్‌ తో పాటు గుల్‌మార్గ్‌, పహల్‌గామ్‌లతో సహా ప్రధాన పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. స్థానిక ప్రజలు, పర్యాటకులతో సహా వందలాది మంది నగర కూడలిలో వేడుకల్లో చేరారు, బాలీవుడ్ పాటల ట్యూన్‌లకు పాడుతూ చప్పట్లు కొడుతూ వేదికను అబ్బురపరిచారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ రాజేంద్ర తివారీ, “పిల్లలు, యువకులు, వృద్ధుల” “ఉత్సాహాన్ని” కొనియాడారు. “ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా మార్పులు వచ్చాయని నేను విన్నాను. ఆ మార్పును నా కళ్లతో చూడాలనుకున్నాను. ఈ ఉద్దేశంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శ్రీనగర్‌కు వచ్చాను” అని చెప్పారు. 
 
 “నేను సంతోషించాను. కాశ్మీర్ నా దేశంలో భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. “లాల్ చౌక్‌లో చాలా అరుదైన, విలక్షణమైన ప్రదర్శన” అంటూ రాజకీయవేత్త సజాద్ లోన్‌తో సహా పలువురు ఈ కార్యక్రమాలను నిర్వహించిన అధికారులను అభినందించారు.