మణిపూర్‌లో మరోసారి హింసాకాండ .. లోయ జిల్లాలో కర్ఫ్యూ

* ఢిల్లీకి ప్రతినిధి వర్గం పంపాలని సీఎం నిర్ణయం
 
హింసాకాండకు గురైన మణిపూర్ సంవత్సరం మొదటి రోజున పౌరులపై తాజాగా దాడులు నెలకొనడంతో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం సాయంత్రం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో నలుగురు వ్యక్తులను కాల్చి చంపారు. మరో 12 మంది వరకు గాయాలకు గురయ్యారు. 
 
 తాజా కాల్పుల ఘటనతో రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ గుర్తించారు. ఇంకా గుర్తించని సాయుధులు లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో మభ్యపెట్టే దుస్తులతో వచ్చి స్థానికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. దాడిలో గాయపడిన వారినిఆసుపత్రికి తరలించాపారు.  దాడి అనంతరం కోపోద్రిక్తులైన స్థానికులు మూడు నాలుగు చక్రాల వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ కార్లు ఎవరికి చెందినవో వెంటనే తెలియరాలేదు.
ఒక వీడియో సందేశంలో, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హింసను ఖండించారు మరియు శాంతిని కాపాడాలని ప్రజలకు, ముఖ్యంగా లిలాంగ్ నివాసితులకు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇటీవల రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ (ఆర్పీజి) దాడిలో మణిపూర్ పోలీసులకు చెందిన ముగ్గురు కమాండోలపై జరిగిన దాడి పట్ల కూడా కలవరం వ్యక్తం అవుతుంది. ఈ విషయమై త్వరలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళ్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.  తెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరే వద్ద జరిగిన ఈ దాడిలో ఐదుగురు రాష్ట్ర పోలీసు కమాండోలు గాయపడ్డారు. వారిని విమానంలో ఇంఫాల్‌కు తరలించి ఆసుపత్రిలో చేర్చారు.
ఇటీవల కాలంలో రాష్ట్ర బలగాలపై జరుగుతున్న దాడులు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారాయని బీరెన్ సింగ్ తెలిపారు. పరిస్థితిపై నియంత్రణను కొనసాగించడంలో రాష్ట్ర, కేంద్ర భద్రతా బలగాలు చురుకుగా నిమగ్నమై ఉన్నాయి పేర్కొంటూ  మణిపూర్ ను అస్థిరపరిచేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న ఈ అంశాలను ఎదుర్కోవడానికి భద్రతా బలగాలు పటిష్టమైన, సమగ్రమైన విధానాన్ని అవలంబించాలని సూచించారు.
దాడి అనంతరం బీరేన్ సింగ్ ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మణిపూర్‌లో పరిస్థితిని వివరించేందుకు కేంద్ర నేతలను కలవడానికి త్వరలో ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మణిపూర్ ను అస్థిరతకు గురిచేసేందుకు ప్రయతిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించేందుకు తీసుకోవలసిన చర్యలపై కేంద్రం వద్దకు ఓ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని పంపాలని ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.  కాగా, ఈ ఘర్షణలతో మయన్మార్‌ సరిహద్దులోని మోరే జిల్లాలో మరోసారి కర్ఫ్యూ విధించినట్లు అధికారులు వెల్లడించారు.  కుకీ కమ్యూనిటీకి చెందిన తెంగ్నౌపాల్‌లోనే మోరే జిల్లా కూడా ఉంది. మైతేయి కమ్యూనిటీ దాడుల్లో ఈ ప్రాంతం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. శనివారం మధ్యాహ్నం 3.45కి సాయుధ దుండగులు పోలీస్‌ కమాండోలపై కాల్పులు జరిపారని, సాయంత్రం 5.30 వరకు కాల్పులు కొనసాగాయని దీంతో జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. శనివారం అర్థరాత్రి తీవ్రవాదులు మోరేలోని పోలీస్‌ శిబిరాలపై గ్రెనేడ్‌లతో కాల్పులు జరిపారని ఆ అధికారి తెలిపారు. 

ఆదివారం సాయంత్రం మళ్లీ కాల్పులు జరిగాయని, అయితే గాయాలు, మరణాలకు సంబంధించిన వివరాలు తెలియలేదని జిల్లా పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే, పోలీసుల  నివేదికపై దేశీయ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ ఆగ్రహం వ్యక్త చేసింది. శనివారం కుకీ గ్రామంపై పోలీస్‌ కమాండోలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, మూడు నివాసాలను తగులబెట్టారని ఆరోపించింది. 

పోలీసుల దాడిపై విచారణ జరిపించాలని మరో కమ్యూనిటీ కుకీ ఇన్‌పి, సాదర్‌ హిల్స్‌ డిమాండ్‌ చేసింది.  మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై ”ఫోరమ్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ పీస్‌ ఇన్‌ మణిపూర్‌ ” ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు, చర్చలకు మధ్యవర్తిత్వం వ్యవహరించేందుకు సయోధ్య, నిజ నిర్థారణ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేస్తోంది.

గతేడాది మే 3న కుకీ మైతేయి కమ్యూనిటీల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. అధికార మద్దతుతో మైతేయి కమ్యూనిటీ కుకీ గ్రామాలపై దాడులకు తెగబడింది. గత ఎనిమిది నెలలుగా జరిగిన ఈ హింసాకాండలో ఇప్పటివరకు సుమారు 200 మంది మరణించగా, 60,000 మందికి పైగా  నిరాశ్రయులయ్యారు.