ఎర్ర సముద్రంలో రెండు మిసైళ్లను కూల్చేసిన అమెరికా

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడికి తెగబడ్డారు. పది రోజుల కిందట అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సంకీర్ణ దళాలు ఆపరేషన్‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌ చేపట్టిన తర్వాత తొలిసారి ఈ దాడి జరగడం గమనార్హం. ది మెర్స్క్‌ హాంగ్‌ఝూ అనే కంటెయినర్‌ నౌకపై దాడి జరిగినట్టు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ కూడా ధ్రువీకరించింది. 
 
ఈ క్రమంలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ గ్రావ్‌లీ కూల్చివేసినట్టు ప్రకటించింది. ఈ క్షిపణులను యెమెన్‌లోని హౌతీల అధీనంలో ఉన్న భూభాగం నుంచి ఎగిరినట్లు గుర్తించారు.  అయితే, క్షిపణి దాడి జరిగినా నౌక ప్రయాణానికి ఆటంకం లేదని అమెరికా దళాలు వెల్లడించాయి.
సింగపూర్‌కు చెందిన డెన్మార్క్ యాజమాన్యంలోని మార్స్క్ హాంగ్జౌను ఇరాన్ మద్దతున్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఆ నౌక సిబ్బంది సహాయం కోరడంతో స్పందించినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. 
 
యూఎస్ నేవీ హెలికాప్టర్లు కాల్పులు జరుపడంతో హుతీకి చెందిన మూడు చిన్న బోట్లు సముద్రంలో మునిగిపోయినట్లు చెప్పింది. మరో బోటులోని వారు పారిపోయినట్లు వెల్లడించింది. డెన్మార్క్‌కు చెందిన ఈ నౌక సింగపూర్ సింగపూర్‌ నుంచి ఈజిప్టులోని పోర్టు సయీద్‌కు ప్రయాణిస్తోంది.  ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రవాణా నౌక 24 గంటల్లో రెండవసారి దాడికి గురైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. తొలుత రెండు యాంటీ షిప్‌ బాలిస్టిక్ క్షిపణులతో ఈ నౌకను లక్ష్యంగా చేసుకోగా వాటిని పేల్చివేసినట్లు పేర్కొంది. అయితే ఒక క్షిపణి ఆ నౌకను తాకినట్లు వెల్లడించింది.
 
ఇక, ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ కూటమిలో డెన్మార్క్ చేరిన రెండో రోజే ఈ దాడి చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, ఈ దాడికి కొద్ది గంటల ముందు అమెరికా నేవీ వైస్‌ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌’ చేపట్టిన తర్వాత దాదాపు 1200 వాణిజ్య నౌకలను సురక్షితంగా ఎర్ర సముద్రం దాటించామని వెల్లడించారు.
 
వాటిపై ఒక్క డ్రోన్‌ లేదా క్షిపణి దాడి కూడా జరగలేదని ఆయన తెలిపారు. కానీ, ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే హాంగ్‌ఝూపై దాడి జరిగింది. ఎర్ర సముద్రంలో క్షిపణి, డ్రోన్‌ దాడులు పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్‌ సంస్థల్లో ఒకటైన మెర్స్క్‌ తమ వాణిజ్య నౌకలను సూయజ్‌ నుంచి కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ వైపు దారి మళ్లించింది. 
 
కానీ, అంతర్జాతీయ సంకీర్ణ దళాలు ఎర్ర సముద్రం రక్షణకు గస్తీ చేపట్టడంతో తిరిగి ఈ మార్గంలో తమ నౌకలు ప్రయాణిస్తాయని ఇటీవలే పేర్కొంది.
యెమెన్ నైరుతి తీరంలోని హెడెయిడా పోర్టుకు 55 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్టు తమకు నివేదిక అందిందని యునైటెడ్ కింగ్‌డమ్ మారీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకటించింది. 
 
ఇక, ‘ఆపరేషన్‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌’‌లో భాగంగా అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌కు చెందిన ఐదు యుద్ధ నౌకలు ఈ సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. పశ్చిమ గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌, ఎర్ర సముద్రంలో పహారా కాస్తుండగా.. ఆపరేషన్‌ మొదలైన నాటి నుంచి 17 డ్రోన్లు, నాలుగు నౌక విధ్యంసక బాలిస్టిక్‌ క్షిపణులను ఇవి కూల్చేశాయి. 
 
హౌతీలు మాత్రం ఇజ్రాయేల్‌, ఇజ్రాయేల్‌కు మద్దతిచ్చే దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొంటామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో 12 శాతం మేర ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతుంది. కాగా, ఇటీవల భారత్‌కు వస్తోన్న నౌకను హౌతీలు హైజాక్ చేసి యెమెన్ తీరానికి తరలించిన విషయం తెలిసిందే.