ఎస్వీ యూనివర్సిటీలో `క్రిస్మస్’ వేడుకలపై దుమారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలలో ఓకే మతానికి సంబంధించిన ప్రార్ధనలు, ఉత్సవాలు జరపటానికి అనుమతించారు. పైగా, యూనివర్సిటీ అధికారులే అధికారికంగా ధార్మిక కార్యక్రమాలు జరపడం దేశంలో ఎక్కడా జరగదు.  అయితే, ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ యాజమాన్యం అండదండలతో నడుస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా క్రిస్మస్ సందర్భంగా `సెమీ క్రిస్మస్’ వేడుకలు జరగడం వివాదాస్పదంగా మారింది.

గత సోమవారం సాయంత్రం యూనివర్సిటీ ఆడిటోరియంలో  జరిగిన ఈ క్రిస్మస్ ఉత్సవాలలో ఓ ప్రొఫెసర్ పలువురు ఉద్యోగులకు బైబిలు పంచారనే ప్రచారం జరుగుతుంది. పైగా, ఈ ఉత్సవాలకు హాజరు కావాలంటూ విశ్వవిద్యాలయ అధికారులు అధికారికంగా నోటీసు పంపాడు చెబుతున్నారు.   గత కొంతకాలంగా యూనివర్సిటీ చెందిన ఆ ప్రొఫెసర్ పలువురు ఉద్యోగులకు బైబిలు పంచుతున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.

ఈ క్రిస్మస్ వేడుకల్లో స్వయంగా ఉద్యోగులు, ప్రొఫెసర్లు పాల్గొనడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది. యూనివర్సిటీకి చెందిన పలువురు అధ్యాపకులు, పలువురు ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి ప్రత్యేకంగా  ప్రార్థనలు కూడా చేశారు అధికారులు ఎవరు ఒత్తిడితో ఈ వేడుకలకు అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
టీటీడీ వందలాది ఎకరాలు భూమిని కేటాయించడంతోపాటు అభివృద్ధి కోసం వార్షిక నిధులను కూడా చాలా ఏళ్లుగా మంజూరు చేస్తుంది. వర్సిటీలో నిర్వహించే పలు విద్య, వైజ్ఞానైక సదస్సులకు, పరిశోధన ప్రోజెక్టులకు కూడా టిటిడి ఆర్థిక వనరులను సమకూరుస్తుంది. యూనివర్సిటీ పాలకవర్గంలో టిటిడి ప్రతినిధులు కూడా ఉంటారు. అయినా, ఏనాడూ కనీసం శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రార్ధనలు గాని, పూజలు గాని యూనివర్సిటీలో జరిపిన ఉదంతాలే లేవు. 
 
కనీసం హిందువుల పండుగలు కూడా జరిపారు. తిరుమలలో పెద్ద ఎత్తున జరిగే బ్రహ్మోత్సవం, ఇతర ఉత్సవాలలో స్వచ్ఛంద సేవకు యూనివర్సిటీ ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు గాని పాల్గొన్న సందర్భాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో వర్సిటీ క్రిస్మస్ వేడుకలకు వేదిక కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయం నుండి యూనివర్సిటీలో ఆయన కుటుంబానికి సన్నిహితులైన క్రైస్తవ అధ్యాపకుల ప్రాబల్యం పెరుగుతూ వస్తున్నది. ఆయన హయాంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువైన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ సతీమణి, మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుందరవల్లి ఈ `సెమి క్రిస్మస్’ వేడుకలు జరపడంలో కీలక పాత్ర వహించినట్లు చెబుతున్నారు.
టిటిడి విరాళంగా ఇచ్చిన భూమిలో, ప్రతి ఏటా టిటిడి గణనీయంగా నిధులు సమకూరుస్తున్న యూనివర్సిటీ ఆవరణలో ఈ విధంగా క్రిస్మస్ వేడుకలు జరపడం, క్రైస్తవ మత ప్రచార వేదికగా మారడం పట్ల హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల అండదండలతోనే ఈ విధంగా బరితెగించి జరిపినట్లు స్పష్టం అవుతుంది.