న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటాము. కానీ న్యాయస్థానంలోనే తన సీనియర్ జడ్జి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా తనకు న్యాయం అందక పోవడంతో విరక్తితో కనీసం `గౌరవంగా చనిపోయేందుకు’ అనుమతి కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కు ఓ మహిళా జడ్జి లేఖ వ్రాయడం కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్ తనకు సుఖమైన చావు కల్పించాలని కోరుతూ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సీనియర్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అందుకే తాను హుందాగా చనిపోయే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ఆ లేఖలో ఆమె వేడుకున్నారు. సోషల్ మీడియాలో ఆ లేఖ వైరల్ అయ్యింది.
బందాకు చెందిన ఓ మహిళా జడ్జి ఆ లేఖను రాశారు. బారాబంకికి చెందని జిల్లా జడ్జి వేధిస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆమె ఆరోపించారు. అన్ని రకాలుగా తనను వేధిస్తున్నారని, ఓ చెత్తకుండిలా తనను చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు.
“నేను సర్వీస్‌లో ఉన్న తక్కువ సమయంలో, బహిరంగ కోర్టులో వేదికపై దుర్భాషలకు గురైన అరుదైన గౌరవం నాకు దక్కింది.. నేను చాలా వరకు లైంగిక వేధింపులకు గురయ్యాను.నన్ను పూర్తిగా చెత్తలా చూసుకున్నారు.నేను అవాంఛిత కీటకంగా భావిస్తున్నాను” అని ఆమె రాసిన లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“నా ఫిర్యాదులు, వాంగ్మూలంలను ఖచ్చితమైన సత్యంగా తీసుకుంటారని నేను ఊహించడంలేదు.నేను కోరుకున్నది న్యాయమైన విచారణ మాత్రమే, ” అని ఆమె చెప్పింది. ఓ రాత్రి తన సీనియర్‌ని కలవమని కోరినట్లు ఆమె ఆరోపించింది.సీజే చంద్రచూడ్ ఆ లేఖకు స్పందించారు. ఆయన ఆదేశాలమేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం ఖురేఖర్..అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. మహిళా జడ్జి ఇచ్చిన ఫిర్యాదుపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీజే ఆదేశించారు.
హైకోర్టు తాత్కాలిక జడ్జి ఆ లెటర్ గురించి ఆరా తీస్తున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలైలో విచారణ చేపట్టారని, కానీ ఆ విచారణలో ఏమీ తేలలేదని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. సమగ్ర విచారణ కోసం జిల్లా జడ్జిని బదిలీ చేయాలని ఆ మహిళ తన లేఖలో కోరారు. కానీ ఆ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.
తనకు ఇక జీవించాలని లేదని, గత ఏడాది కాలం నుంచి తానో శవంలా జీవిస్తున్నాని, జీవం లేని ఈ శరీరాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఇక లాభం లేదని, నా జీవితానికి ఎటువంటి అర్థం లేదని అంటూ ఆమె ఆ లేఖలో తెలిపారు. వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నాలు చేయవద్దని ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో ఉద్యోగం చేసే తోటి మహిళలకు హితవు చెప్పారు.
“మీరు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడతారని మహిళలు ఎవరైనా భావిస్తే.. నేను న్యాయమూర్తిగా ఉంది కూడా నా కోసం న్యాయమైన విచారణ కూడా చేయించుకోలేక పోయాను.… ఆడవాళ్ళందరికీ బొమ్మలాగా లేదా జీవం లేని వస్తువుగా ఉండడం నేర్చుకోవాలని నేను సలహా ఇస్తున్నాను” అంటూ తన నిస్సహాయతను వెల్లడి చేశారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత