
మహిళల్లో జరిగే రుతుస్రావం వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. నెలసరి అయ్యే మహిళలకు పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ జా రాజ్యసభలో వేసిన ప్రశ్నకు ఆమె బదులు ఇచ్చారు. పెయిడ్ లీవ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు.
మహిళలకు రుతుస్రావం కావడం సమస్య కాదు అని, నెలసరి, రుతుక్రమం వైకల్యమే కాదని ఆమె తెలిపారు. ఇది మహిళల జీవితాల్లో సహజమైన ప్రక్రియ అని మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.మహిళా ఉద్యోగులకు ఇచ్చే లీవ్‌ల అంశంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఆర్జేడీ నేత జా ప్రశ్న వేశారు.
రుతుస్రావం వంకతో సమాన అవకాశాల్ని దూరం చేయడం కరెక్టు కాదని ఆమె చెప్పారు. అలాగే మహిళల పీరియడ్స్ సమయంలో మహిళలు పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ఆమె అన్నారు.10 నుంచి 19 ఏళ్ల మధ్య అమ్మాయిల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్‌ను అమలు చేస్తోందని ఆమె వివరించారు.
కాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “స్మృతి ఇరానీ కరెక్ట్‌గా చెప్పారు. ఇలా పెయిడ్ లీవ్స్ ఇస్తే, మహిళా ఉద్యోగులకే ప్రతికూలం. రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో సంస్థలు వారిని దూరం పెట్టే అవకాశం ఉంటుంది,” అని ఓ వ్యక్తి ట్విట్టర్లో కామెంట్ చేశారు. “నెలసరి సమయంలో మహిళలకు పెయిడ్ లీవ్స్ కావాలని పురుషులు అభిప్రాయపడకూడదు. ఉద్యోగం విషయంలో దేశంలో ఇప్పటికే పురుషులు- మహిళ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇలా పెయిడ్ లీవ్స్ ఇస్ మహిళలకు ఉద్యోగావకాశాలు పడిపోతాయి,” అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.
“నెలసరి పేరుతో పెయిడ్ లీవ్స్ ఇవ్వకూడదు. నేను మహిళలకు వ్యతిరేకం కాదు. కానీ ఇలా లీవ్స్ ఇస్తే.. రిక్రూట్మెంట్లో కష్టం అవుతుంది,” అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. అయితే, కొందరు స్మృతి ఇరానీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు కూడా! “నెలసరి అనేది వైకల్యం కాదు. వారికి పెయిడ్ లీవ్స్ అక్కర్లేదన్నారు సరే! మరి మెటర్నిటీ లీవ్స్ ఎందుకిస్తున్నారు? పిల్లలను డెలివరీ ఇవ్వడం అనేది వైకల్యమా? అది సహజమైన ప్రక్రియ కాదా? మీ అంత విశాలవంతమైన జీవితం చాలా మందికి ఉండదు. చాలా నొప్పులు పడి ఉద్యోగం చేయాల్సి వస్తుంది,” అని ఓ మహిళ ట్విట్టర్లో పేర్కొంది.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది