పన్నూన్‌ హత్యకై కుట్రపై అమెరికా ఆరోపణల పట్ల అభ్యంతరం

ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్‌ గుప్తా (52) కుట్ర పన్నాడని, హత్య చేసేందుకు ఈ ఏడాది మేలో అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారితో లక్ష డాలర్లు ఒప్పందం కూడా కుదిరిందని న్యూయార్క్‌ కోర్టులో ఆరోపణలు నమోదయ్యాయి. ఫెడరల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆరోపణల ఆధారంగా అమెరికా న్యాయ విభాగం అతనిపై కేసు నమోదుచేసింది. 
 
ఈ నేరంలో దోషిగా తేలితే నిఖిల్‌ గుప్తాకు 10 ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని న్యూయార్క్‌ జిల్లా యూఎస్‌ అటార్నీ మాథ్యూ జీ ఓల్సెన్‌ తెలిపారు. ఈ కేసులో నిందితుడు నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు 2023 జూన్‌ 30న అరెస్టు చేశారు. అయితే ఈ హత్య కోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని అమెరికా ఆరోపించడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
పన్నూన్ హత్య కుట్ర కేసుని తాము పరిశీలిస్తున్నామని,  ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని,  ఈ ఆరోపణలపై న్యూఢిల్లీ ఉన్నత స్థాయి విచాచణ ప్రారంభించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, పన్నూ హత్య కోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. 
 
పైగా,  ఈ హత్య కుట్రలో నిఖిల్ గుప్తా ప్రమేయం ఉందనడానికి అమెరికా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.  ఇలాంటి ఈ కేసుల కారణంగా అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే అవసరమైతే, గుప్తాకు న్యాయ సాయం అందిస్తామని కూడా చెప్పారు.
‘ఒక వ్యక్తికి భారతీయ అధికారితో సంబంధం ఉందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఇది ఆందోళన కలిగించే విషయం. ఇది ప్రభుత్వ విధానానికి కూడా విరుద్ధమని మేము చెప్పాం. అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత నేరాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, తీవ్రవాదుల మధ్య సంబంధాలు తీవ్రమైన అంశాలు. ఈ ఆరోపణలపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేశాం. నివేదిక ఆధారంగా మార్గనిర్దేశం చేస్తాం’ అని బాగ్చీ వెల్లడించారు.
ఇలా ఉండగా, ఫెడరల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆరోపణల ఆధారంగా అమెరికా న్యాయ విభాగం భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్‌ గుప్తా (52)పై కేసు నమోదుచేసింది. ఈ నేరంలో దోషిగా తేలితే నిఖిల్‌ గుప్తాకు 10 ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని న్యూయార్క్‌ జిల్లా యూఎస్‌ అటార్నీ మాథ్యూ జీ ఓల్సెన్‌ తెలిపారు. ఈ కేసులో నిందితుడు నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు 2023 జూన్‌ 30న అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఇద్దరు అమెరికా నిఘా అధికారులు భారత్‌కు చేరుకున్నారు.