తెలంగాణ ఎన్నికల సమయాన..కేటీఆర్ “కల్వరి” భజన…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఇటు క్రిస్టియన్, అటు ముస్లిం ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నాలుగడుగులు ముందే ఉండగా.. ఆ వెనుకే కాంగ్రెస్ పార్టీ కూడా పరుగులు తీస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి వరకు.. చర్చ్ పాస్టర్లు, ముస్లిం మత పెద్దల ప్రాపకం సంపాదించేందుకు పోటీ పడుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం తమ అధినాయకులనే అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతోన్న అనేక క్రిస్టియన్ సువార్త సంఘాలు, చర్చ్‌ల నిర్వాహకులను సంప్రదిస్తున్నారు.
హైదరాబాద్ మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ ఏ స్థాయిలో బలవంతపు మత మార్పిడులకు, హిందూ ధర్మంపై దాడులకు పాల్పడుతోందో తెలియంది కాదు. పాస్టర్ సతీష్ కుమార్ అనే వ్యక్తి 2005లో స్థాపించిన ఈ మత సామ్రాజ్యం ఇవాళ.. హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణ, ఏపీ లోని అనేక జిల్లాలకు వ్యాపించి.. హిందూ మత మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. అమాయక హిందువుల్ని క్రిస్టియన్లుగా మార్చే ఓ దుర్మార్గమైన కార్యక్రమం కల్వరి టెంపుల్ సాక్షిగా జరుగుతోంది. బలమైన నెట్‌వర్క్ ఆధారంగా తన క్రైస్తవ సువార్త సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న పాస్టర్ సతీష్ కుమార్.. తన కల్వరి టెంపుల్‌కు పెద్ద సంఖ్యలో వచ్చే వారిని తన ప్రధాన  ఆదాయ వనరులుగాను, తన ఎదుగుదలకు ఉపయోగపడే మెట్లుగానూ వాడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇటీవల కల్వరి టెంపుల్‌ను సందర్శించి.. ఈ ఎన్నికల్లో చర్చ్‌కు వచ్చే వారి మద్దతును సంపాదించేలా మాట్లాడారు. ప్రేయర్ ఆయిల్ అమ్మకాల దగ్గర నుంచి దశమ భాగాల సమర్పణ వరకు కల్వరి టెంపుల్‌ను ఓ కార్పొరేట్ క్రిస్టియన్ బిజినెస్‌ హబ్ గా మార్చేసిన పాస్టర్ సతీష్ కుమార్‌ను కేటీఆర్ ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కల్వరి టెంపుల్‌ను సందర్శించటం, సతీష్ కుమార్‌ను పొగడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో కన్వర్టడ్ క్రిస్టియన్ల ఓట్ల కోసమే ఆయన ఇలా.. సువార్త సంఘాల బాట పట్టారనే టాక్ వినిపిస్తోంది.
అయితే.. హిందూ ధర్మంపై తీవ్రమైన దాడికి పాల్పడుతున్న కల్వరి టెంపుల్ లాంటి క్రైస్తవ సువార్త సంఘాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్ లాంటి వాళ్ళు సైతం ఓట్ల కోసం క్రిస్టియన్ పాస్టర్ల భజన చేయటం కరెక్ట్ కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాజకీయ స్వార్థం కోసం హిందూ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్న వ్యక్తులకు, పార్టీలకు హిందూ సమాజం తగు రీతిన గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకతను తాజా పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.  జై హింద్.