యూనివర్శిటీ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 2026లో హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ నుండి పట్టభద్రులయ్యే ఏ విద్యార్థినీ న్యాయవాదిగా నమోదు చేసుకోకూడదని భారత బార్ కౌన్సిల్ (బిసిఐ) ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది.
అయితే కొద్దిసేపటకే బిసిఐ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులను ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వివాదంలోకి లాగారని తెలిపింది. నల్సార్ వర్సిటీ విద్యార్థులు దేశంలోని ఏ బార్ కౌన్సిల్‌లోనైనా న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది. నల్సార్ కాన్వకేషన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తూ చేపట్టిన ప్రచారంపై బిసిఐ చర్చలకు దిగింది.
ప్రచారాన్ని ప్రారంభించడం, నిర్వహించడం, సమన్వయం చేయడం, విద్యార్థులను సమీకరించడంలో ప్రధన పాత్ర పోషించిన విద్యార్థులు ఇతర వ్యక్తుల వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని బీసీఐ చైర్మన్, బిజెపి రాజ్యసభ సభ్యుడు మానన్ కుమార్ మిశ్రా నల్సార్ యాజమాన్యాన్ని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులను ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా న్యాయవాదులుగా నమోదు చేయకూడదని స్పష్టం చేశారు.
అత్యున్నత న్యాయపదవిపై గౌరవం లేకుండా వ్యవహరించే విద్యార్థి భవిష్యత్తులో బాధ్యతాయుతమైన న్యాయవాది, ఉపాధ్యాయుడు, న్యాయమూర్తిగా ఉండటం ఆశించలేమని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఇలాంటి ప్రవర్తన న్యాయనాద వృత్తి గౌరవం, క్రమశిక్షణ, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో సమ్మెలు, బహిష్కరణలకు పాల్పడి న్యాయవాద వృత్తి ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
న్యాయవిద్య నియంత్రణ సంస్థగా ఈ పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండలేమని బిసిఐ స్పష్టం చేసింది. కాగా, నల్సార్ విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసతూ ఆంక్షలు విధించిన బిసిఐ తన నిర్ణయంపై వెనక్కి తక్కింది. బీసీఐ చైర్మన్ తొలి లేఖలో మార్పులు, చేర్పులు చేస్తూ మరొక అధికారిక లేఖను విడుదల చేశారు. నల్సార్ 2026 బ్యాచ్‌లో అత్యధిక విద్యార్థులు అమాయకులని అభిప్రాయపడింది.
వారి తప్పేమీ లేదని తెలిపింది. కొందరు టీచర్లు, బయట వ్యక్తులు విద్యార్థులను ప్రేరేపించారనే సమాచారం తమవద్ద ఉందని బిసిఐ తెలిపింది. అయితే విచారణ మాత్రం కొనసాగుతుందని తెలిపింది. వీసీ విచారణ నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని బిసిఐ స్పష్టం చేసింది.
ఇదేసమయంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై విధించిన నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని, నల్సార్ వర్సిటీ విద్యార్థులు దేశంలోని ఏ బార్ కౌన్సిల్‌లోనైనా న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, బిసిఐ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడంతో నల్సార్ యూనివర్శిటీ విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతుంది.

More Stories
ఆయుష్ వైద్య విద్యార్థుల మహా ధర్నా.. ఎబివిపి మద్దతు
మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కన్నులపండువగా ‘తిరంగా ర్యాలీ’