బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్‌ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. మంగళవారం బీహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అగ్రకుల పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 శాతంగా ఉందని గుర్తు చేశారు.
దానితో, బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్‌ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచితే మొత్తం రిజర్వేషన్‌ల శాతం 75 శాతానికి పెరుగుతుందని, మిగతా 25 శాతం ఓపెన్ కోటాగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు రేజర్వేషన్లు 50 శాతం దాటకూడదని పరిమితి విధించడం గమనార్హం.
‘రిజర్వేషన్‌ల పరిమితిని కచ్చితంగా 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలి. అగ్ర కులాల పేదలకు ఇప్పటికే 10 శాతం రిజర్వేషన్ (ఈడబ్ల్యూఎస్) ఉంది. దాంతో మొత్తం రిజర్వేషన్‌ల పరిమితి 65+10=75 శాతం అవుతుంది’ అని తెలిపారు. మిగతా 25 శాతం ఓపెన్ కోటాగా ఉందని చెబుతూ గతంలో 40 శాతంగా ఓపెన్ కోటా రిజర్వేషన్ 25 శాతానికి తగ్గుతుందని నితీష్ కుమార్ వెల్లడించారు.
కాబట్టి బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్‌ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. కాగా, తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రిజర్వేషన్ల శాతం పెంచుతూ గురువారమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో స్మృతి మంధాన