తిరుమల కాలినడక మార్గంలో మరో చిరుత

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుత పులుల సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది.  కొద్ది రోజుల క్రితం కాలి నడక మార్గంలో కొండపైకి వెళ్తున్న భక్తుల్లో ఓ చిన్నారి లక్షితపై పులి దాడి చేసింది.
ఈఘటన జరిగిన ప్రదేశానికి అతి సమీపంలో అంటే 2850 మెట్టు దగ్గర టీటీడీ అటవీశాఖ అధికారులు పులి కోసం బోను ఏర్పాటు చేశారు. అందులో బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత చిక్కింది.  గత వారం రోజులుగా అదే ప్రాంతంలో చిరుత తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. బుధవారం వేకువజామున బోనులో చిక్కిన ఏర్రకు చిరుత చిక్కినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతను తిరుపతిలోని జూపార్క్ కు తరలించారు. 
 
ఇప్పటి వరకూ మొత్తం 6 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించి జూపార్క్ తరలించారు. ఇందులో రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. యాత్రికులు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్నీ చర్యలు టీటీడీ తీసుకుంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. కొండపైకి నడిచి వచ్చే భక్తులతో పాటు భద్రతా సిబ్బందిని కూడా నియమించామని పేర్కొన్నారు.
 
గుంపులు గుంపులుగా వెళ్ళమని అభ్యర్థించి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపటం కోసం కర్రలు ఇచ్చినట్లుగా తెలిపారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మళ్ళీ చిరుతల్ని పట్టటానికి టిటిడి అటవీ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తుందని చెప్పారు. బుధవారం తెల్లవారు జామున చిక్కిన ఆరవ చిరుతను నాలుగు సంవత్సరాల వయసు ఉన్నదిగా గుర్తించామని వివరించారు.