
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ప్రజల శాంతియుత జీవనానికి భంగం కలిగించేలా, ఓటర్ల ఆలోచనలను మళ్లించేలా ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ప్రచారం చేసుకుంటునన బీజేపీ నేతలపై రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. ధర్మవరం పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. స్థానిక శారద నగర్లో బీజేపీ కార్యకర్తలు భాను శ్రీనివాసులు ఉండగా అటువైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారు.
బీజేపీ కార్యకర్తలను గమనించిన వైసీపీ వర్గాలు దూషిస్తూ 30 మంది ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల బరిలో ఉండటంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు హైదరాబాద్ నుంచి బీజేపీ కార్యకర్త భాను శ్రీనివాసులు ధర్మవరం వచ్చారు.
ఈ క్రమంలో వైసీపీ నేతలు దాడి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై బూతుల దండకం చదివారు.
బీజేపీ అభ్యర్థి సత్య కుమార్‌పై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కేతిరెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
More Stories
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు