
అటువంటి చేయూతను దేశం లోని అనాథ చిన్నారులు అందరికీ వర్తింపజేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రంజీత్ బెనర్జీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఈ ధర్మాసనంలో జసన్టిస్ జెబి పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని కోర్టుకు తెలపడానికి నాలుగు వారాల సమయం ఇవ్వాల్సిందిగా అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం, సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
విద్యాహక్కు చట్టం కింద అనాథ చిన్నారులకు విద్యావకాశాలను కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ స్పందనలను తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి కల్పించిన ప్రభుత్వ పథకాల సదుపాయాలను అనాథలకు కూడా వర్తింప చేయాలని కోరుతూ పి.పి శుక్లా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.
More Stories
ఆధార్‌పై మూడీస్ ఆరోపణలు నిరాధారం
గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్
ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ ఆస్తుల స్వాధీనం