మహారాష్ట్ర నుండి ఉల్లి ఎగుమతులకు అనుమతి

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ మహారాష్ట్ర నుంచి 99,500 టన్నుల ఉల్లిపాయలను ఆరు పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  కొన్ని నెలల క్రితం దేశంలో పెరుగుతోన్న ఉల్లి ధరలను అదుపులో పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. భారత్ డిసెంబర్ 8, 2023న ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది.
 
దీంతో ఉల్లి ధరలు తగ్గాయి. అయితే రైతలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్, యూఏఈ, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, శ్రీలంక దేశాలకు 99,150 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్త పంట సమయం కాబట్టి ఎగుమతులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
ఉల్లిపాయల నిల్వ నష్టాన్ని తగ్గించడానికి, ముంబైలోని బార్క్​ సాంకేతిక మద్దతుతో గత సంవత్సరం 1,200 టన్నుల రేడియేషన్ కోల్డ్ స్టోరేజీ నిల్వ చేసింది. ఇప్పుడు దాన్న5,000 టన్నులకు పెంచాలని నిర్ణయించారు. ఈసారి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్ణాటకలో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.12 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
 
ప్రస్తుతం హోల్ సేల్ లో కిలో ఉల్లిగడ్డ రూ. 20 పలుకుతోంది. అంటే రైతుల నుంచి కిలో రూ. 10 నుంచి రూ.20 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రూ.10 తక్కువ చెల్లిస్తున్నారు. దీంతో ఉల్లి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఎగుమతులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ముఖ్యంగా ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్ర రైతులు ఉల్లి ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం పోరాటలు కూడా చేశారు.